Site icon NTV Telugu

Agent : ఏజెంట్ కు బెస్ట్ విషెష్ చెప్పిన మన్మథుడు

Nag

Nag

Agent : యంగ్ హీరో అఖిల్ నటించిన తాజా సినిమా ఏజెంట్. స్పై యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ ఏజెంట్ నేడు భారీ స్థాయిలో పలు భాషల్లో ఆడియన్స్ ముందుకి వచ్చింది. కెరీర్లో సరైన హిట్ లేని అఖిల్ ఏజెంట్ తో సాలిడ్ హిట్ కొట్టాలని కసితో సినిమాలో నటించాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. ఇక ఏజెంట్ మూవీ నేడు విడుదల అవుతుండటంతో ఏజెంట్ టీమ్ కి కింగ్ అక్కినేని నాగార్జున ఒక నోట్ ద్వారా స్పెషల్ గా బెస్ట్ విషెస్ తెలియచేసారు. ‘నా కుమారుడివి అలానే యంగ్ కొలీగ్ అయిన అఖిల్, నువ్వు కెరీర్ పరంగా చూసిన ఎత్తుపల్లాలు నాకు తెలుసు. ఇక ఈ సినిమా కోసం నువ్వు పడ్డ కష్టం అలానే ఆడియన్స్, ఫ్యాన్స్ కి మంచి సినిమా అందించాలని ఏజెంట్ మూవీ కోసం పడ్డ శ్రమ వృధా కాదని నా నమ్మకం. తప్పకుండా ఈ మూవీతో కెరీర్ పరంగా పెద్ద సక్సెస్ సొంతం చేసుకోవాలని, అలానే మీ టీమ్ మొత్తం పడ్డ శ్రమకు తగ్గ ఫలితం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ నాగ్ పోస్ట్ చేసిన నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also:Sudigali Sudheer : మంచులో ‘గాలోడు’.. రష్మి ఎక్కడ భయ్యా ?

ఈ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా దీనిని సురేందర్ 2 సినిమాస్ తో కలిసి ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ స్థాయిలో నిర్మించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఏజెంట్ తప్పకుండా సక్సెస్ అవుతుందని యూనిట్ ఆశాభవం వ్యక్తం చేస్తోంది. ఈ మూవీ ప్రీమియర్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. సినిమా ఎలా ఉందో ప్రేక్షకుల సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు.

Exit mobile version