Site icon NTV Telugu

Nagarjuna: తాత కాబోతున్న కింగ్ నాగార్జున?

Nagarjuna

Nagarjuna

టాలీవుడ్ కింగ్ నాగార్జున త్వరలోనే తాతగా ప్రమోషన్ పొందబోతున్నారనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతోంది. మొదట నాగచైతన్య-శోభిత దంపతుల గురించి రూమర్స్ రాగా, తాజాగా అఖిల్-జైనబ్‌లు తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై తాజాగా ఒక హెల్త్ ఈవెంట్‌లో నాగార్జున స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.”మీరు తాత గా ప్రమోట్ అవుతున్నారట కదా.. నిజమేనా?” అని మీడియా అడగగా.. ఆయన,

Also Read : Avatar : రివ్యూస్‌తోనే షాక్ ఇస్తున్న ‘అవతార్ 3’.. విజువల్స్ అదిరాయి.. కానీ అదే మైనస్?

నవ్వుతూ ‘సరైన సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను’ అంటూ దాటవేశారు. ఈ వార్తలను ఆయన ఖండించకపోవడంతో, అక్కినేని ఇంట్లో త్వరలోనే వారసుడు లేదా వారసురాలు అడుగుపెట్టబోతున్నారనేది నిజమేనని నెటిజన్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అంతే కాదు అదే వేదికపై నాగార్జున తన ఆరోగ్యానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.. తాను గత 15 ఏళ్లుగా తీవ్రమైన మోకాలి నొప్పితో బాధ పడుతున్నట్లు ఆయన వెల్లడించారు. సర్జరీ చేయించుకోవడం ఇష్టం లేక, లూబ్రికెంట్ ఫ్లూయిడ్స్ మరియు పీఆర్‌పీ (PRP) చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.. ‘నొప్పి ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా మోకాలి కోసం వ్యాయామం చేస్తాను.. అది అస్సలు మిస్ అవ్వదు’ అని తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టారు. 60 ప్లస్‌లో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా కనిపించే నాగార్జున, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా తన క్రమశిక్షణతో వాటిని జయిస్తున్న తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

Exit mobile version