NTV Telugu Site icon

Nagarjuna : నా కొడుకు సంతోషంగా ఉండు.. అదే మాకు ఆనందం : నాగార్జున

New Project (85)

New Project (85)

Nagarjuna : అక్కినేని నాగ చైతన్య మరో కొత్త జీవితంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అయ్యాడు. శోభిత ధూళిపాళతో ఎంగేజ్మెంట్ కావడంతో నాగ చైతన్య ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. ఎందుకంటే, గతంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ అయిన సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు విడిపోవడం పట్ల అభిమానులు విచారం వ్యక్తం చేశారు. చైతు, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం రీసెంటుగా హైదరాబాద్ లో జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా ప్రకటించారు. వారిద్దరూ ప్రేమ, సంతోషంతో జీవించాలని ఆకాంక్షించారు. వారికి దేవుడు ఆశీసులు ఉంటాయని దీవించారు. నాగచైతన్య, శోభిత చేసుకోబోతున్నారని గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ వార్తలే నిజమయ్యాయి. వీరి రెండు కుంటుబాలు ఒప్పుకోవడంతో సన్నిహితుల సమక్షంతో నిశ్చితార్థం చేశారు. పెళ్లి ముహూర్తం ఎప్పుడనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. మంచి ముహూర్తం చూసి త్వరలో పెళ్లి చేస్తారని తెలుస్తోంది. నాగచైతన్య నిశ్చితార్థంపై అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని కుటుంబానికి అభినందనలు తెలుపుతున్నారు.

Read Also:Hero Surya : షాకింగ్ న్యూస్… షూటింగులో హీరో సూర్య తలకి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్

ఇక ఇది ఇలా ఉంటే.. నాగ చైతన్య ప్రస్తుతం సంతోషంగా ఉన్నట్లు అక్కినేని నాగార్జున వెల్లడించారు. నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం విషయంలో మా కుటుంబం మొత్తం సంతోషంగా ఉంది. సమంతతో విడాకుల తర్వాత చైతు చాలా నరక వేదన అనుభవించాడు. కానీ ఆ బాధని ఎవరితో చెప్పుకోలేదు. ఇప్పుడు నా కొడుకు సంతోషంగా ఉండడం.. మాకు ఆనందంగా ఉంది అని అన్నారు. చైతన్య శోభిత పెళ్లికి కొంత సమయం తీసుకుంటామని నాగ్ తెలిపారు. మరో రెండు లేదా మూడు నెలల తర్వాత చైతన్య శోభిత పెళ్లి జరిగే అవకాశాలున్నాయి. మన్మథుడు నాగార్జున చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక నాగ చైతన్య తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

Read Also:AP IAS Officers Transfer: ఏపీలో మరో సారి ఐఏఎస్‌ల బదిలీలు..

Show comments