గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ఒక వార్త తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా అక్కినేని నాగార్జున స్పందిస్తూ అదంతా కేవలం రూమర్ మాత్రమేనని తేల్చి చెప్పారు. ఒక ఈవెంట్‌లో నాగార్జునను ‘మీరు తండ్రి నుంచి తాతగా ప్రమోషన్ పొందుతున్నారా?’ అని అడగ్గా.. ఆయన ‘సరైన సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను’ అని సరదాగా సమాధానం ఇచ్చారు. అయితే, ఆయన ఇచ్చిన ఈ మర్యాదపూర్వకమైన జవాబును కొందరు తప్పుగా అర్థం చేసుకుని, శోభిత గర్భవతి అని వార్తలు అల్లేశారు. దీనిపై నాగ్ మరళ స్పందిస్తూ.. ఇలాంటి వ్యక్తిగత విషయాలపై వార్తలు రాసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతే కాదు
Also Read : Lenin : ‘లెనిన్’ షూటింగ్ పూర్తి చేసిన అఖిల్.. కానీ?
తన కోడలు శోభిత గురించి నాగార్జున ఎంతో గొప్పగా మాట్లాడారు. శోభిత తమ కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఎంతో సంతోషం వచ్చిందని, ఆమె ప్రతి విషయంలోనూ చాలా పాజిటివ్‌గా ఉంటుందని కొనియాడారు. శోభిత చాలా గ్రౌండెడ్ అమ్మాయి అని, ఆమె రాకతో తమ జీవితాలు మరింత కళకళలాడుతున్నాయని నాగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం చైతూ, శోభిత తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారని, తాతయ్యను చేసే ఆ ‘గుడ్ న్యూస్’ నిజంగానే ఉన్నప్పుడు తామే స్వయంగా అందరికీ చెబుతామని నాగార్జున స్పష్టం చేశారు. దీంతో గత కొద్ది రోజులుగా నెట్టింట సాగుతున్న ప్రచారానికి ఒక్కసారిగా తెరపడింది.
