Site icon NTV Telugu

Naga Chaitanya : మరోసారి నాగ చైతన్యతో రొమాన్స్ చేయబోతున్న బుట్టబొమ్మ.. థ్రిల్లింగ్ కాన్సెప్ట్ అట

New Project 2024 11 16t075144.300

New Project 2024 11 16t075144.300

Naga Chaitanya : టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ లో పెట్టేస్తున్నాడు.. గతంలో ధూత సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా సాలిడ్ హిట్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు అదే జోష్ లో మరో మూవీ తండేల్ సినిమాను చేస్తున్నాడు.. ఆ సినిమా భారీ ధరకు ఓటీటీ డీల్ కుదుర్చుకుంది.. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. త్వరలోనే ఆ సినిమా కూడా రెగ్యులర్ షూట్ కు రెడీ అవుతుంది. ఇక ఇప్పుడు మరో సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.. కార్తీక్ దండు దర్శకత్వం వహించగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. అంజిష్ లోకానాథ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహారిస్తున్నారు.. ఈ సినిమాను త్వరలోనే పూజా కార్యక్రమాలతో సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో నాగచైతన్య ఉన్నారు.

Read Also:Rohit Sharma: రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా సజ్దే

టాలీవుడ్‌లో కొన్ని కాంబోలకు మంచి క్రేజ్ నెలకొంటుంది. అలాంటి వాటిలో అక్కినేని నాగచైతన్య, పూజా హెగ్డే కాంబో కూడా ఒకటి. ‘ఒక లైలా కోసం’ సినిమాలో వీరి కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత వీరి కాంబినేషన్‌లో సినిమా ఏదీ రాలేదు. అయితే, ఇప్పుడు త్వరలోనే వీరి కాంబోలో ఓ సినిమా రాబోతుందని తెలుస్తోంది. ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కించనున్న ఓ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సినిమాలో నాగచైతన్య నటించేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను మేకర్స్ తీసుకునేందుకు ఆసక్తిని చూపుతున్నారట. దీంతో వీరిద్దరి కాంబినేషన్ త్వరలోనే సెట్ కానుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాను బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రంతో నిజంగానే చైతూ-పూజా కాంబో ఫిక్స్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Read Also:CM Revanth Reddy: నేడు మరోసారి మహారాష్ట్రకు సీఎం.. రెండు రోజులు షెడ్యూల్ ఇదే..

ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే కాదు సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతుందని సమాచారం.. ఒకప్పుడు కేవలం ప్రేమ కథా చిత్రాలను, లేదా యాక్షన్ సినిమాలతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చే నాగచైతన్య ఇప్పుడు కొత్త సస్పెన్స్, థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఉన్న సినిమాలానే ఎంపిక చేసుకుంటున్నాడు.. ధూత సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న చై అదే ఫార్ములానే ఫాలో అవుతున్నాడని తెలుస్తుంది.. ఇప్పుడు రాబోయే సినిమాలో ఏ కాన్సెప్ట్ తో వస్తాడో చూడాలి.. ఏది ఏమైనా నాగ చైతన్య సినిమాల స్పీడును పెంచాడు..

Exit mobile version