Site icon NTV Telugu

Naga Vamsi : ఐ బొమ్మ రవి విషయంలో నాగవంశీ సైలెంట్.. భయపడుతున్నాడంటూ నెటిజన్ల కామెంట్స్ !

Nagavamshi

Nagavamshi

టాలీవుడ్‌లో ఐ బొమ్మ రవి ఇష్యూ పెద్ద సంచలనం రేపుతోంది. నిర్మాత సీ. కళ్యాణ్ ఆయనను ఏకంగా ఎన్‌కౌంటర్ చేయాలని వరకు కామెంట్స్ చేయగా, మరోవైపు అతన్ని అరెస్ట్ చేయడం అన్యాయమని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఐ బొమ్మ రవిపై ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. పైరసీకి వ్యతిరేకం గా ఎప్పటినుంచో పోరాడుతున్న వారిలో నాగవంశీ ఒకరు. ఆయన నిర్మించిన ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి సంబంధించిన హెచ్‌డీ ప్రింట్లు ఓవర్సీస్ సెన్సార్ సమయంలో లీక్ అయ్యాయని ఆయన గతంలో బహిరంగంగా చెప్పడంతో, పైరసీ గ్యాంగ్స్ ఎలా పనిచేస్తున్నాయన్న దానిపై పెద్ద చర్చ నడిచింది. ఈటీవీ విన్ తమ కంటెంట్‌ను ఎలా రక్షిస్తున్నారో, అదే స్ట్రాటజీ మేము అనుసరిస్తామని ఆయన అప్పుడే చెప్పారు.

Also Read : Avatar 3 : ఇండియాలో అవతార్ 3 కి హైప్ లేకపోవడానికి అసలు కారణం ఇదే!

ఇక తాజాగా ఆయన నిర్మిస్తున్న ‘ఎపిక్’ మూవీ టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో, విలేకరి అడిగిన “90ల మేజిక్ ఏది? ఇప్పుడు ఏమి మిస్ అవుతున్నాం?” అన్న ప్రశ్నకు నాగవంశీ స్పందిస్తూ.. “సోషల్ మీడియాలో ఐ బొమ్మ రవినే రాబిన్‌హుడ్‌ని చేసిన లోకంలో ఉన్నాం మనం. 50 రూపాయలు టికెట్ పెంచితే మేమే విలన్స్ వాడు మాత్రం హీరో! ఇలాంటి సోసైటీ‌లో మీరు పోలికలు ఎలా చెబుతారు?” అని సూటిగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జర్నలిస్టులు మళ్లీ ఐ బొమ్మ రవి ఇష్యూపై ప్రశ్నలు అడగాలని ప్రయత్నించగా, “ఆ టాపిక్ వద్దు మాట్లాడి‌తే నా రాబోయే సినిమాకు సమస్య వస్తుంది” అని ఆయన దూరంగా జరిగిపోయా‌రు. ప్రస్తుతం నాగవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, ఫిల్మ్ సర్కిల్స్‌లో వేడివేడి చర్చలకు కారణమవుతున్నాయి. దీంతో కొంత మంది నెటిజన్లు “ఆ టాపిక్ వద్దు” అని తప్పించుకున్న నాగవంశీ ఐబొమ్మ రవికి భయపడి నడుచుకున్నా‌డా? అంటూ కామెంట్‌లు చేస్తున్నారు.

Exit mobile version