నాగ శౌర్య తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఒక ఫుల్ లెంగ్త్ మాస్ రోల్‌లో కనిపిస్తున్న చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత నాగ శౌర్య వెండితెరపైకి రాబోతున్నారు. రమేష్ దేసేన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామాలో విధి యాదవ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సముద్రఖని విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించడం మరో విశేషం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. కాగా ట్రైలర్‌లో నాగ శౌర్య ఊర మాస్ గెటప్, పవర్‌ఫుల్ డైలాగ్స్ చూస్తుంటే ఆయన బాక్సాఫీస్ వద్ద గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నట్లు అర్థమవుతోంది.
Also Read : The Paradise: ‘ది ప్యారడైజ్’ రిలీజ్ విషయంలో నాని లెక్క మళ్ళి తప్పుతుందా?
ఈ సినిమా ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, సాయి కుమార్ వంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రంపై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ ఈవెంట్‌లో పాల్గొన్న నాగ శౌర్య, ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటి శ్రీదేవి విజయ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను చిన్నప్పుడు ప్రభాస్ నటించిన ‘ఈశ్వర్’ సినిమా చూసినప్పటి నుండే శ్రీదేవి పెద్ద అభిమానినని, ఆమె ఈ సినిమాలో నటించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అంతే కాదు శ్రీదేవి ఈ చిత్రానికి ఒక ‘లక్కీ చార్మ్’ లాంటి వారని, ఆమె ఉంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం తనకు ఉందని ఆయన ఎమోషనల్ గా మాట్లాడారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
