NTV Telugu Site icon

Thandel : వాస్తవ ఘటనల ఆధారంగా నాగచైతన్య ‘తండేల్’..

Thandel

Thandel

Thandel : టాలీవుడ్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ చందు మొండేటి గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.జిఏ 2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.ఈసినిమాలో నాగ చైతన్య సరసన స్టార్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.దర్శకుడు చందు మొండేటి కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నాడు.కార్తికేయ 2 తరువాత చందు మొండేటి నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ కావడంతో “తండేల్” సినిమాపై భారీగా అంచనాలు వున్నాయి.

Read Also :Indian 2 : ఇండియన్ 2 సెన్సార్ పూర్తి? రన్ టైం ఎంతంటే..?

నాగ చైతన్య ,చందు మొండేటి కాంబినేషన్ లో గతంలో ప్రేమమ్ ,సవ్య సాచి వంటి రెండు సినిమాలు వచ్చాయి.ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి.దీనితో వీరి కాంబినేషన్ లో వచ్చే మూడో సినిమా “తండేల్” పై కూడా అంచనాలు భారీగానే వున్నాయి.ఈ సినిమాలో నాగ చైతన్య మత్స్యకారునిగా కనిపించనున్నాడు.ఈ చిత్రం శ్రీకాకుళంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతుంది .ఇదిలా ఉంటే ఈ సినిమా లోని కొన్ని సన్నివేశాల్లో వాస్తవికత కనిపించేలా స్థానిక మత్స్యకారులను షూటింగ్ లో భాగం చేస్తున్నట్లు సమాచారం.పాకిస్తాన్ సైన్యం చేతిలో చిక్కిన భారతీయ మత్స్యకారులు ఎలా బయటపడ్డారనేదే ఈ సినిమా కథ.మేకర్స్ త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.

Show comments