NTV Telugu Site icon

Naga Chaitanya New Movie: హిట్ డైరెక్టర్‌తో నాగ చైతన్య సినిమా.. మరోసారి ఆ స్టార్ హీరోయిన్‌తో రొమాన్స్!

Naga Chaitanya New Movie

Naga Chaitanya New Movie

Pooja Hegde in Naga Chaitanya and Karthik Varma Dandu Movie: చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తండేల్‌’ సినిమాలో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్నారు. ఇందులో చైకి జంటగా సాయి పల్లవి నటిస్తున్నారు. బన్నీవాస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమ కథగా చందూ దీన్ని తీర్చిదిద్దుతున్నారు. మత్స్యకార యువకుడిగా చైతన్య ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే మరో చిత్రంను చై లైన్‌లో పెట్టారు.

హిట్ డైరెక్టర్‌ కార్తీక్ వర్మ దండుతో నాగ చైతన్య సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. షూటింగ్ మరో 2 నెలల్లో ప్రారంభమవుతుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మించబోతుంది. ‘విరూపాక్ష’ సినిమాతో కార్తీక్ దండు మంచి పేరు తెచ్చుకున్నాడు. విరూపాక్ష హిట్ కొట్టడంతో ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. కస్టడీ నిరాశ పర్చడంతో తండేల్‌, కార్తీక్ దండు సినిమాపై చై భారీ ఆశలు పెట్టుకున్నారు.

Also Read: Aadujeevitham OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆడు జీవితం’!

కార్తీక్ దండు, నాగ చైతన్య సినిమాలో స్టార్ హీరోయిన్‌ పూజా హెగ్డే నటించనున్నట్లు తెలుస్తోంది. పూజా-చైతు మధ్య లవ్ స్టోరీ చాలా ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తోంది. వీరిద్దరు కలిసి ‘ఒక లైలా కోసం’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా హిట్ అవ్వడంతో.. మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫాన్స్ అంటున్నారు. ఈ సినిమాలో చైతన్య డ్యూయెల్ రోల్‌లో కనిపించబోతున్నారని, ఒక పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.

Show comments