నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో.. చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘తండేల్’. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదలైంది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా.. నేడు(ఫిబ్రవరి 11) హైదరాబాద్‌లోని ట్రిడెంట్ హోటల్ లో “తండేల్ బ్లాక్ బస్టర్ లవ్ సునామీ” ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పాల్గొన్నారు. అలాగే నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. ఈ ఈవెంట్‌కి నాగ చైతన్య, శోభిత కలిసి వచ్చారు. పెళ్లి తర్వాత మొదటి సారి సినిమా ఈవెంట్‌కి కలిసి రావడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. “అసలైన బుజ్జితల్లి” అంటూ యాంకర్ నాగ చైతన్య సతీమణి శోభితను ఉద్ధేశించి అన్నారు.
READ MORE: Minister Kollu Ravindra: మద్యం ధరల పెంపుపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు..
ఇదిలా ఉండగా.. ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. శుక్రవారంతో పాటు శనివారం, ఆదివారంతో పాటు సోమవారం కూడా సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా గట్టిగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 73 కోట్ల 20 లక్షలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సినిమా టీం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈరోజు కూడా వసూళ్లు స్టడీగా కొనసాగి రేపు కూడా కొంత గట్టిగా వసూళ్లు లభిస్తే 100 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ధియేటర్లకు కదిలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.