Site icon NTV Telugu

Naga Babu: అభిమానులకు రిక్వెస్ట్.. దయచేసి ఆ వార్తలు నమ్మవద్దు

Naga Babu

Naga Babu

మెగా, జనసేన అభిమానులకు నాగబాబు సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన చేశారు. ఈనెల 17న తాను ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్లు వస్తున్న వార్తలను నాగబాబు ఖండించారు. నిర్ధార‌ణ చేసుకోకుండా మీడియాలో ఇటువంటి వార్తలు ఇవ్వడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఏమైనా పర్యట‌న‌లు ఉంటే అందుకు సంబంధించిన షెడ్యూల్ గురించి జ‌న‌సేన పార్టీ అధికారికంగా ప్రక‌ట‌న చేస్తుందని సూచించారు. తాను ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దని నాగబాబు కోరారు.

Andhra Pradesh: రైతులకు శుభవార్త.. రేపు వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు జమ

మరోవైపు చిత్తూరు జిల్లా జనసేన నేతలు శనివారం సాయంత్రం నాగబాబును కలిశారు. ఈ సందర్భంగా తమ జిల్లాలోని పలు సమస్యలను గురించి నాగబాబుకు వివరించారు. జిల్లాకు తలమానికమైన చక్కెర కర్మాగారం మూసివేతతో పాటు విజయా డైరీపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఆయన దృష్టి తీసుకెళ్లారు. ఇతర రాష్ట్రాలతో అనుసంధానం అయ్యే రవాణా వ్యవస్థ, నీటి వనరులు, వాయు మార్గం ఉండి కూడా అభివృద్ధిలో వెనుకబడిన చిత్తూరును అభివృద్ధి చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకోవాలని వారు నాగబాబును కోరారు.

Exit mobile version