Naga Babu: ఒక పెద్ద చెట్టు కొట్టేస్తే.. పది మొక్కలు నాటాలి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు ఏపీ ప్రభుత్వం ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ పదవిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ శ్రావణ పౌర్ణమి సందర్భంగా మంగళగిరి అరణ్య భవన్‌లోని చైర్మన్ ఛాంబర్ కో వేదమంత్రాల నడుమ వేదాశీర్వచనం అనంతరం నాగబాబు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తనకు ఈ బాధ్యతలు ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. భవిష్యత్తులో వాతావరణం బాగుండాలంటే మొక్కలు పెంచాల్సిందే అని అన్నారు. ఒక పెద్ద చెట్టు కొట్టేస్తే.. పది మొక్కలు నాటాలి అనే విషయాన్ని అమలులోకి తెస్తాం అని నాగబాబు చెప్పారు.
‘గ్రీనరీ మీద పవన్ కళ్యాణ్, నాకు చాలా ఇంటరెస్ట్ ఉంది. మేం చాలా చోట్ల చెట్లు నాటాం. చెట్లు నాటడం అనేది సొంతగా చేయడంతో పెద్దగా చేయలేకపోయాం. రాష్ట్రంలో గ్రీనరీ పెంచాలనే కోరిక నాకు ఉంది. నా జీవితాశయ గా ఉన్న గ్రీనరీ కళ్యాణ్ బాబుకి కూడా తెలుసు. భారతదేశంలో మొదటి గ్రీనరీ సంస్ధ ఇదే. అడవులలోనే కాదు, రాష్ట్రం మొత్తంగా చూస్తే 29 శాతం మాత్రమే గ్రీనరీ ఉంది. గ్రీన్ కవర్‌ను 50 శాతంకు తీసుకురావాలనే టార్గెట్ ఉంది. అన్ని సంబధిత డిపార్ట్మెంట్లతో సమన్వయంతో పని చేయాలి. ప్రజలను గ్రీన్ మూవ్‌మెంట్‌గా దిశగా తీసుకెళ్ళాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జియోట్యాగింగ్, డ్రోన్స్ ద్వారా మొక్కల పెరుగుదలను పరిశీలిస్తాం. ఒక మొక్క జీవిత కాలంలో కోట్ల రూపాయల విలువ కలిగి ఉంటుంది’ అని నాగబాబు తెలిపారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
‘భవిష్యత్తులో వాతావరణం బాగుండాలంటే మొక్కలు పెంచాల్సిందే. ఎంతో కొంత డ్యామేజీ జరగడం తప్పదు.. అలా జరగకుండా చూడాలంటే మొక్కలు కావాలి. భారతదేశంలో ప్రతీ బిడ్డకు ఆరోగ్యకర వాతావరణం ఇవ్వడానికి ఇదొక అవకాశం. మనం భూమాత వనరులను భవిష్యత్తు తరాల నుంచి అప్పు తీసుకున్నట్టు భావించాలి అనే ఆఫ్రికన్ సామెతను ఫాలో అవ్వాలి. ఒక పెద్ద చెట్టు కొట్టేస్తే పది మొక్కలు నాటాలి అనే విషయాన్ని అమలులోకి తెస్తాం. చారిత్రక విలువ ఉన్న చెట్లును వేరో చోటకు తరలిస్తాం’ అని ఎమ్మెల్సీ నాగబాబు చెప్పారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!