NTV Telugu Site icon

Thandel : అంచనాలను పెంచేస్తున్న తండేల్.. మూడో సింగిల్ కు ముహూర్తం ఫిక్స్

New Project (80)

New Project (80)

Thandel : యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించనున్నారు. నిజ జీవిత కథగా జరిగిన ఒక ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ముందుగా డిసెంబర్ నెల 2024 లో రిలీజ్ చేస్తారని అనుకున్నారు. తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ సినిమాలు క్యూ కట్టి ఉండడంతో ఈ సినిమాని ఫిబ్రవరి 7న రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన రెండు పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి . ‘తండేల్’ సినిమాలోని ‘బుజ్జి తల్లి’ అనే పాట యూట్యూబులో ట్రెండింగులో ఉంది.

Read Also:Harish Rao: ప్రజాపాలన కాదు.. ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలన

తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాలోని మూడో సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘హైలెస్సో హైలెస్స’ అంటూ సాగే ఈ పాట మెలోడీగా రానుందని మేకర్స్ వెల్లడించారు. ఈ పాటను మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్‌తో పాటు అజీజ్ నాకాష్ ఆలపించారు. ఈ పాటను జనవరి 23న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ‘తండేల్’ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దేవీ ఈ చిత్రానికి చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారని, కచ్చితంగా సినిమా మ్యూజికల్ హిట్ అవుతుందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది.

Read Also:APPSC Group-1 Mains: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష తేదీలు వచ్చేశాయ్