NTV Telugu Site icon

Kalki 2898 AD : ‘కల్కి’తో సరికొత్త ప్రపంచం ఆవిష్కరించబోతున్న నాగ్ అశ్విన్..?

Kalki

Kalki

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “సలార్” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రభాస్ బిజీగా వున్నాడు .ప్రభాస్ చేస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 ఏడి’.ఈ సినిమాను మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్‌ఆశ్విన్‌ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ సరికొత్త ప్రపంచం ఆవిష్కరించబోతున్నాడు.సినిమాలో మరిన్నికొత్త పాత్రలను పరిచయం చేయబోతున్నాడు. ‘కల్కి 2898 ఏడి’ సినిమా ఇండియన్‌ స్క్రీన్‌పై ఇంతకు ముందెన్నడూ చూడని అద్భుతం అని ఆ సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ చెబుతున్నారు.ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపిక పదుకొణే,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

అలాగే ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు.’కల్కి 2898ఏడి’ ప్రభాస్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.శ్రీమద్భాగవతంలో ప్రస్తావించిన ఓ అంశం ఆధారంగా పురాణపాత్రల నేపథ్యంలో జరిగే ఫాంటసీ, సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ గా  ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే రీసెంట్ గా ద్రోణుడి తనయుడు అశ్వద్థామగా అమితాబ్‌ను చిత్ర యూనిట్ పరిచయం చేసింది. అయితే ఈ సినిమా విడుదల తేదీపై ప్రేక్షకుల్లో కన్ఫ్యూషన్ నెలకొంది .ఈ సినిమాను మే 9న విడుదల చేయనున్నట్టు వైజయంతీ మూవీస్‌ సంస్థ కొన్ని నెలల క్రితం ప్రకటించింది. అయితే.. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాలలో  ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నిర్మాతలు సినిమా విడుదల వాయిదా వేసి త్వరలోనే కొత్త డేట్‌ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తున్నది. కాగా, విడుదలకు ముందే, ఈ సినిమాపై ఓ యానిమేషన్‌ వీడియోను వైజయంతీ మూవీస్‌ సంస్థ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ వీడియో ద్వారా ‘కల్కి 2898’ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లనున్నట్లు సమాచారం.

Show comments