NTV Telugu Site icon

Nabha Natesh : కాలేజీ స్టూడెంట్స్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన ఇస్మార్ట్ పోరి.. వీడియో వైరల్..

Nabhaaa

Nabhaaa

ఇస్మార్ట్ పోరి నభా నటేష్ గురించి అందరికీ తెలుసు.. తక్కువ సినిమాల్లో నటించిన సోషల్ మీడియాలో మాత్రం యమ క్రేజ్ ను అందుకుంది.. మొదటి సినిమాతో నటిగా మంచి మార్కులు వేయించుకుంది.. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేసిన కూడా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో కుర్రాళ్లను రెచ్చ గొడుతుంది.. తాజాగా నభా డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఆ వీడియోలో అనంతపూర్ లోని SV గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన ఈవెంట్ కి నభా నటేష్ హాజరైంది. ఆ ఈవెంట్లో కాలేజీ స్టూడెంట్స్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది.. తన మొదటి సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని చిలక చిలక పాటకు మాస్ స్టెప్పులు వేసింది.. ఆమె ఎనర్జి డ్యాన్స్ ను స్టూడెంట్స్ బీట్ చెయ్యలేక పోయారు.. ఇంటర్నేషనల్ డాన్స్ డే కావడంతో నభా నటేష్ ఈ డాన్స్ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఇక అమ్మడు సినిమాల విషయానికొస్తే..’ఇస్మార్ట్ శంకర్’ తర్వాత వచ్చిన క్రేజ్ తో ఆయా చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు ఆశించిన మేర ఫలితానివ్వలేదు. చివరిగా ‘మ్యాస్ట్రో’ చిత్రంలో నటించింది. అది హిట్ టాక్ ను అందుకోలేదు.. త్వరలో నభా నటేష్, ప్రియదర్శితో కలిసి డార్లింగ్ సినిమాతో రాబోతుంది. అలాగే స్వయంభు సినిమాలో నటిస్తుంది.. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..