NTV Telugu Site icon

Naa Saamiranga : టీవీలోకి వచ్చేస్తున్న నాగార్జున మూవీ.. ఎప్పుడంటే?

Naa Saami Ranga

Naa Saami Ranga

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఈ మధ్య వరుస సినిమాలలో నటిస్తున్నారు.. రీసెంట్ గా నా సామిరంగా సినిమాలో నటించాడు.. ఆ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు విడుదల ముందు నుంచే మంచి టాక్ ను అందుకుంది.. ఇప్పుడు భారీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.. సినిమా ప్రీ బిజినెస్ లలో అమ్ముడు పోయిన దానికన్నా భారీగానే వసూళ్లను రాబట్టింది..

డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సినిమానే ‘నా సామిరంగ’. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు..ఎం. ఎం కీరవాణి సంగీతాన్ని అందించారు.. ఈ సినిమా ఓటీటి రైట్స్ కు భారీగా అమ్ముడుపోయిన విషయం తెలిసిందే..డిస్ని హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.. అక్కడ కూడా మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది..

ఇక ఈ సినిమా టీవీ లోకి రాబోతుంది.. మార్చి 24 న ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుందని సమాచారం.. ఈ సినిమాను టీవీ లో చూసేందుకు నాగ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఇక ఈ సినిమా అటు థియేటర్లలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇటు ఓటీటీలో మంచి టాక్ తో దూసుకుపోతుంది.. మరి టీవిలో ఏ మాత్రం రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి..