NTV Telugu Site icon

Naa Saami Ranga: ‘నా సామిరంగ’ ట్రైలర్ డేట్ లాక్ .. ఎప్పుడంటే?

Na Samiranga

Na Samiranga

అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఇప్పటివరకు సంక్రాంతికి తెలుగు నుండి అయిదు సినిమాలు విడుదలను అనౌన్స్ చేయగా.. రవితేజ ఈగల్ మూవీ ఈ రేస్ నుంచి తప్పుకోవడంతో ఈ సినిమాకు కలిసి వచ్చింది.. జనవరి 14న విడుదల కానున్న ‘నా సామిరంగ’ ట్రైలర్ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. తాజాగా ఈ ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్..

నా సామిరంగ’ ట్రైలర్ను జనవరి 9న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. జనవరి 9న మధ్యాహ్నం 3.15 గంటలకు ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్లో మంచి కొరియోగ్రాఫర్గా ఎంతోమంది యంగ్ హీరోలకు కొరియోగ్రాఫీ చేసిన విజయ్ బిన్నీ.. ‘నా సామిరంగ’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇప్పటికే విడుదలయిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.. మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా కథ ఉంటుందని టీజర్ ను చూస్తే తెలుస్తుంది..

ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ మూవీలో సెకండ్ హీరోల పాత్రలు చేసిన అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ పాత్రలకు కూడా హీరోయిన్స్ ఉన్నారు. ఇందులో అల్లరి నరేశ్కు జంటగా మిర్నా మోహన్ నటిస్తుండగా.. రాజ్ తరుణ్కు జోడీగా రుక్సార్ మెరిసింది. విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ కాబట్టి ‘నా సామిరంగ’పై నాగ్ ఫ్యాన్స్లో అంచనాలు బాగానే ఉన్నాయి… సోగ్గాడే చిన్నినాయనా లాగా భారీ హిట్ ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.. ఈ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు..