Site icon NTV Telugu

Naa Saami Ranga : దాస్ పాత్రలో కనిపించనున్న డాన్సింగ్ రోజ్ ‘షబీర్’.. వైరల్ అవుతున్న లుక్..

Whatsapp Image 2024 01 11 At 6.34.23 Pm

Whatsapp Image 2024 01 11 At 6.34.23 Pm

టాలీవుడ్‌ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం ‘నా సామి రంగ’.. ఈ చిత్రాన్నివిజయ్ బిన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. పవన్‌ కుమార్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్‌ బెజవాడ కథ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్‌ నాగార్జున సరసన హీరోయిన్ గా నటిస్తోండగా.. అల్లరి నరేశ్ మరియు రాజ్ తరుణ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నా సామి రంగ జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ లో బిజీగా ఉన్నారు.. ఇప్పటికే సినిమాలో అల్లరి నరేశ్‌, రాజ్ తరుణ్,ఆషికా రంగనాథ్‌ మరియు మిర్నా మీనన్‌ పాత్రలను మేకర్స్‌ పరిచయం చేశారు.తాజాగా ఈ మూవీ నుంచి మరో యాక్టర్ లుక్‌ ను విడుదల చేశారు. సర్పట్టా పరంబరై మరియు కింగ్‌ ఆఫ్ కొత్త ఫేం షబీర్‌ (డ్యాన్సింగ్ రోజ్‌) లుక్‌ ను లాంఛ్ చేశారు. షబీర్‌ ఇందులో దాస్‌ పాత్రలో కనిపించనున్నాడు. జీప్‌పై సీరియస్‌గా కూర్చున్న లుక్‌ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతోంది.

ఈ మూవీలో అల్లరి నరేశ్ అంజిగాడు పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో అంజి గాడి పాత్ర ఎంతో కీలకంగా ఉండనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే అంజిగాడు గ్లింప్స్ లో అంజిగాడు వచ్చేసాడు సూసారా..సూసెయ్యండి.. లేదంటే మాటోచ్చేత్తాది అంటూ సాగే డైలాగ్స్‌ మూవీ లవర్స్‌ను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాయి.మరోవైపు అంజిగాడి ప్రాణం మిర్నా మీనన్‌ ఈ మూవీలో మంగ పాత్రలో కనిపించనుంది. నెత్తిన మల్లెపూలు, చేతిలో సద్దిమూటతో పొలంలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మిర్నా మీనన్‌లుక్‌ ఇప్పటికే నెట్టింట తెగ వైరల్ అవుతుంది.రీసెంట్ ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయింది.నాగార్జున నటించిన కిష్టయ్య పాత్రను ఎలివేట్ చేస్తూ అల్లరి నరేష్ వాయిస్‌ ఓవర్‌తో సాగే డైలాగ్స్‌తో ట్రైలర్‌ మొదలవుతుంది.కిష్టయ్యగా నాగ్‌ పక్కా విలేజ్‌ గెటప్‌లో మాస్‌ అవతార్‌లో వినోదాన్ని అందించబోతున్నట్టు ట్రైలర్‌తో మేకర్స్‌ క్లారిటీ ఇచ్చేశారు.

Exit mobile version