Woman Killed by Lover with Gelatin Bomb in Mysuru: ఈ మధ్య కాలంలో ఎవరిని ఎప్పుడు, ఎవరు, ఎందుకు చంపుతున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అక్రమ సంబంధాలతో కొందరు కట్టుకున్న వాళ్లనే కడతేరుస్తుంటే.. మరికొందరు వారికి వారే బలైపోవడమో.. హత్య గావించబడడమో జరుగుతోంది. తాజాగా మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. లవర్‌ను లాడ్జీలోకి తీసుకుళ్లి జిలెటిన్ పెట్టి హత్యచేశాడో క్రూరుడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక మైసూరు జిల్లా హున్సూర్ తాలూక జెరసనహల్లి గ్రామానికి చెందిన రక్షిత (20) అనే వివాహిత తన లవర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. కొన్ని రోజుల క్రితం తన తల్లి గారి ఇంటికి వచ్చిన రక్షిత.. తన ప్రియుడు సిద్ధరాజును కలవాలని ఫ్లాన్ చేసుకుంది. ఇద్దరు కలిసి గ్రామంలోని ఓ లాడ్జ్‌కు వెళ్లారు. లాడ్జ్‌లో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సిద్ధరాజు ఆవేశంతో ఊగిపోయాడు. రక్షిత నోట్లో జిలెటిన్ బాంబు పెట్టి పెల్చేశాడు. దీంతో ఆమె నోరంతా చిద్రమయి.. రక్తపు మడుగులో చనిపోయింది.
జిలెటిన్ పేలడంతో హోటల్ సిబ్బంది, అక్కడున్న వాళ్లంతా సిద్ధరాజు ఉన్న గదికి పరుగెత్తుకొచ్చారు. ఆ శబ్దం ఏంటని ప్రశ్నించగా.. సెల్ ఫోన్ పేలిందని అతడు చెప్పాడు. ఇదేమి నమ్మని హోటల్ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం వారి స్టైల్లో నిందితుడి విచారించగా.. నిజం ఒప్పుకున్నాడు. సిద్ధరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
