Site icon NTV Telugu

Karishma kapoor: నా భర్త నన్ను వేలం వేశాడు.. కరిష్మా కపూర్ సంచలన వ్యాఖ్య..!

Karishma

Karishma

సినీ ప్రపంచంలో డేటింగ్​, పెళ్లి​, డివొర్స్​ వంటివి చాలా కామన్. ఇందుకు సంబంధించి అనేక సార్లు వార్తలను వింటుంటాం. ఇది ఇలా ఉండగా.. విడాకులు తీసుకున్న ఓ హీరోయిన్​ తాజాగా తన వైవాహిక జీవితం గురించి పెను సంచలన విషయాలను తెలియ చేసింది. ఆమె మాజీ భర్త తనపై ఏకంగా వేలం పాట పెట్టాడని ఆమె చెప్పుకొచ్చింది. అందులోనూ హనీమూన్​ లో అతడితో పాటు స్నేహితులతో కూడా కలిసి తాను సన్నిహితంగా గడపాలని ఆయన తనని బలవంతం చేసినట్లు గుర్తుచేసుకుని ఎమోషనల్ అయింది.

Read Also: Swatimutyam: ‘స్వాతిముత్యం’కి 38 వసంతాలు…

మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ కరీష్మా కపూర్. బాలీవుడ్ ఇండస్ట్రీలో కపూర్ ఫ్యామిలీకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. వీరి కుటంబం నుంచి వచ్చిన హీరోయినే కరిష్మా కపూర్. ప్రేమ ఖైదీ అనే సినిమాతో హీరోయిన్‌ గా తన కెరీర్‌ ను మొదలు పెట్టింది. ఆపై అనేక సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ ​గా తార స్థాయికి ఎదిగింది. ఇలా ఇండస్ట్రీలో పదేళ్ల పాటు తన జోరు చూపిస్తూ దూసుకెళ్లింది. ఇందులో భాగంగానే ఆమె పలు అవార్డులను కూడా కైవసం చేసుకుంది.

Read Also: Cyber Frauds: అంతు చిక్కని సైబర్ మోసాలు.. మూడు రోజుల్లో 5 కోట్లు మాయం

కెరీర్ మంచి ఫామ్ ​లో ఉన్న సమయం లోనే ఆవిడ హీరో అజయ్‌ దేవగణ్‌తో పీకల్లోతు ప్రేమాయణంను నడిపించింది. కాకపోతే అది వర్కౌట్ కాలేదు. ఆపై అభిషేక్ బచ్చన్‌ ను ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కాకపోతే ఇది కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత 2003లో ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ తో ఆమె పెళ్లి పీటలు ఎక్కింది. ఆయనతో పెళ్లి జరిగాక కూడా కరీష్మా కెరీర్‌ ను బాగానే కొనసాగించింది. అంతేకాదు వీరికి ఇద్దరు బిడ్డలు కూడా. కొంతకాలానికి సంజయ్ తో కూడా మనస్పర్థలు రావడంతో 2016 లోనే విడాకులు ఇచ్చేసింది. కాకపోతే ఇప్ప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Exit mobile version