Site icon NTV Telugu

My Dear Donga : ఓటిటీలో అదరగొడుతున్న “మై డియర్ దొంగ”..ఆ రికార్డ్ క్రాస్ చేసిందిగా..

My Dear Donga

My Dear Donga

My Dear Donga : టాలీవుడ్ పాపులర్ కమెడియన్ అభినవ్ గోమఠం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ నగరానికి ఏమైంది సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన అభినవ్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.ఆ తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించాడు.తాజాగా ఈ అభినవ్ గోమఠం ప్రధాన పాత్రలో నటించిన ‘మై డియర్ దొంగ’ ఎలాంటి అంచనాలు లేకుండా ఏప్రిల్ 19వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కు వచ్చింది.ఈ చిత్రంలో అభినవ్ గోమఠం, శాలినీ కొండేపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల మరియు శశాంక్ మండూరి ప్రధాన పాత్రలు పోషించారు.

శాలినీ కొండేపూడినే ఈ మూవీకి కథను అందించగా బీఎస్ సర్వజ్ఞ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.అయితే ఎలాంటి అంచనాలు లేకుండా ఓటిటిలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.సింపుల్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం తాజాగా 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్క్ దాటేసింది.ఇందుకు సంబందించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ “100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ఇంకా కౌంటింగ్. ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా మీ మనసులను, స్క్రీన్ టైమ్‍ను మై డియర్ దొంగ దోచేస్తున్నాడు” అని ఆహా ట్వీట్ చేసింది.

Exit mobile version