కమెడియన్ నుంచి హీరోగా పాపులారిటిని సొంతం చేసుకున్న నటుడు అభినవ్ గోమటం.. మస్త్ షెడ్స్ ఉన్నాయిరా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా అనుకున్న హిట్ టాక్ ను అందుకోక పోయిన హీరో నటనకు మంచి మార్కులు పడ్డాయి.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ‘మై డియర్ దొంగ’సినిమాలో నటించాడు.. ఆ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలై భారీ సక్సెస్ ను అందుకుంది.. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది..
అభినవ్ టైటిల్ పాత్రలో నటించాడు.. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. బీఎస్ సర్వాంగ కుమార్ దర్శకత్వం వహించారు. క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం‘ఆహా’లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.. ఈ ఈవెంట్ కు టీమ్ మొత్తం హాజరై సందడి చేశారు..
ఈ సందర్బంగా హీరో అభినవ్ మాట్లాడుతూ.. ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా సినిమాని ఇంత చక్కగా ఆడియన్స్ ముందుకు తీసుకెలుతున్న మీడియాకి థ్యాంక్స్ చెప్పారు.. అలాగే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లి ఆహా టీమ్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.. ఈ ఈవెంట్ కు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక అభినవ్ మరో రెండు సినిమాలకు సైన్ చేసినట్లు సమాచారం..