NTV Telugu Site icon

My Dear Donga : ఓటీటీలోకి వచ్చేస్తున్న మై డియర్ దొంగ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2024 01 09 At 4.30.56 Pm

Whatsapp Image 2024 01 09 At 4.30.56 Pm

ఈ నగరానికి ఏమైంది ఫేమ్ అభినవ్ గోమటం హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మై డియర్ దొంగ.. ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.ఈ మూవీలో అభినవ్ గోమటంతో పాటు శాలిని కొండెపూడి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మై డియర్ దొంగ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆహా ఓటీటీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. అడవి దొంగ విన్నారు. టక్కరి దొంగ విన్నారు. జేబు దొంగ విన్నారు. కానీ మై డియర్ దొంగ ఎవరో తెలియాలంటే త్వరలో ఆహా ఓటీటీలో చూడాల్సిందే అంటూ ఈ పోస్టర్ క్యాప్షన్ ను జోడించారు.ఈ పోస్టర్‌లో డోర్ చాటుకూ దాక్కొని అభినవ్ గోమఠం కనిపిస్తున్నాడు. శాలిని దేనినో చూసి షాక్ అవుతోన్నట్లుగా పోస్టర్‌లో కనిపిస్తోంది. త్వరలో ఈ మూవీ స్ట్రీమింగ్ ఉంటుందని ఆహా ప్రకటించింది. ఈ జనవరి చివరి వారం మై డియర్ దొంగ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం.

మై డియర్ దొంగ మూవీకి సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను మహేశ్వర్ రెడ్డి నిర్మించాడు. మై డియర్ దొంగలో హీరోయిన్‌గా నటిస్తూనే శాలిని కొండెపూడి ఈ సినిమాకు రైటర్‌గా వ్యవహరించింది. ఈ మూవీకి అజయ్ అరసాడా మ్యూజిక్ అందించాడు. డైరెక్ట్‌గా ఆహా ఒరిజినల్ మూవీగానే మై డియర్ దొంగను రూపొందించినట్లు సమాచారం. ఇందులో అభినవ్ మరియు శాలిని పాత్రలు ఫన్టాస్టిక్ గా సాగుతాయని తెలుస్తుంది.ఈ నగరానికి ఏమైంది సినిమాలో కౌశిక్ పాత్రలో అభినవ్ తన కామెడీ టైమింగ్‌తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలో అతడి క్యారెక్టర్ ఎంతగానో నవ్వించింది. కమెడియన్‌గా ఈ నగరానికి ఏమైంది అభినవ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టిన ఆశించిన మేర అవకాశాలు మాత్రం రాలేదు., మీకు మాత్రమే చెప్తా, శ్యామ్ సింగరాయ్‌, వీరూపాక్ష, స్పై వంటి సినిమాలలో నటించాడు.. అయితే అభినవ్ సేవ్ ది టైగర్స్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మహి వి రాఘవ్ క్రియేటర్‌గా వ్యవహరించిన ఈ సిరీస్‌కు సెకండ్ సీజన్ కూడా రాబోతోంది.