అభినవ్ గోమటం ఇటీవల మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫిబ్రవరి 23న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఫస్ట్ మూవీ రిలీజైన కొద్ది గ్యాప్‌లోనే హీరోగా సెకండ్ మూవీతో త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మై డియర్ దొంగ పేరుతో ఓ మూవీ చేస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు బి.ఎస్ సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. షాలిని కొండెపూడి హీరోయిన్‌గా నటిస్తోంది.అయితే మై డియర్ దొంగ మూవీ థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. మార్చి 15 లేదా 22 నుంచి మై డియర్ దొంగ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్‌చేయబోతున్నట్లు సమాచారం.
మై డియర్ దొంగ టీజర్‌ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో తన కామెడీ టైమింగ్‌తో అభినవ్ గోమటం ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఓ అమ్మాయి ఇంట్లోకి దొంగతనం చేయడానికి వచ్చిన యువకుడు అనుకోని పరిస్థితుల్లో అక్కడే బందీగా చిక్కుకుపోతే ఏం జరిగింది? దొంగకు, యువతికి మధ్య ఏర్పడిన స్నేహం ఎలాంటి మలుపులు తిరిగింది అనే అంశాలతో టీజర్ చాలా ఫన్నీగా సాగింది. దొంగను దొంగ అనకపోతే సందీప్ రెడ్డి వంగా అనలా అనే డైలాగ్ టీజర్‌కు హైలైట్‌గా ఉంది.మై డియర్ దొంగలో నటి షాలిని కొండెపూడి హీరోయిన్‌గా నటిస్తూనే ఈ సినిమాకు కథను అందించింది. కామెడీతో పాటు ఈ సినిమాలో అంతర్లీనంగా స్త్రీ సాధికారతను తెలియజేసే మంచి మెసేజ్ ఉంటుందని సమాచారం. ఈ వెబ్ ఒరిజినల్ మూవీని ఆహా మరియు కేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.మై డియర్ దొంగ మూవీలో అభినవ్ గోమటం, షాలిని కొండెపూడిలతో పాటు దివ్య శ్రీపాద ఓ కీలక పాత్ర పోషిస్తోంది. చూసీచూడంగానే మూవీతో హీరోయిన్‌గా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది షాలిని కొండెపూడి. జయమ్మ పంచాయితీ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం సుహాస్‌తో కేబుల్ రెడ్డి అనే సినిమాలో కూడ నటిస్తుంది
