Mutual Funds: ఫస్ట్ టైం రూ.16000కోట్లు దాటిన.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టిమెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mutual Funds: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు సెప్టెంబర్ నెలలో 30 శాతం తగ్గాయి. సెప్టెంబర్ 2023లో ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.14091.26 కోట్ల పెట్టుబడి నమోదైంది. ఇది ఆగస్టు 2023లో రూ.20,245.26 కోట్లు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇ ఇండియా (AMFI) ఈ డేటాను విడుదల చేసింది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి చారిత్రాత్మక రికార్డును సృష్టించింది. ఫస్ట్ టైం రూ.16,000 కోట్లను దాటింది.
Read Also:Daggubati Purandeswari: అమిత్‌షాను కలిసిన లోకేష్.. ఇప్పుడు సమాధానం చెప్పండి..!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
AMFI (అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా) ప్రకారం.. మార్చి 2021 నుండి వరుసగా 31 నెలల పాటు ఈక్విటీ ఫండ్స్‌లోకి నికర ఇన్‌ఫ్లోలు పెరిగాయి. సెప్టెంబర్ నెలలో లార్జ్ క్యాప్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్ మినహా చాలా ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. సెక్టోరల్ లేదా థీమాటిక్ కేటగిరీకి చెందిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో గరిష్టంగా రూ. 3146 కోట్ల పెట్టుబడి వచ్చింది. రెండవ స్థానంలో స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. వీటిలో పెట్టుబడి నిరంతరం పెరిగింది. స్మాల్ క్యాప్ ఫండ్లలో రూ.2678.47 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అయితే ఇది ఆగస్టులో వచ్చిన రూ.4264.82 కోట్ల కంటే తక్కువ. AMFI ప్రకారం, మల్టీక్యాప్ ఫండ్స్‌లో రూ. 2234.52 కోట్లు, మిడ్ క్యాప్ ఫండ్లలో రూ. 2000.88 కోట్లు, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లలో రూ. 1353.91 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
Read Also:Election Code: ఎన్నికల కోడ్.. రూ.50 వేలకు మించితే..!
సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల ద్వారా పెట్టుబడులు సెప్టెంబర్‌లో తొలిసారిగా ఒకే నెలలో రూ.16,000 కోట్లు దాటిందని ఏఎంఎఫ్ఐ తెలిపింది. ఆగస్టు నెలలో సిప్ ద్వారా రూ.15,245 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సిప్ ద్వారా మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనే అవగాహన చిన్న ఇన్వెస్టర్లలో పెరిగింది. సెప్టెంబర్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ 16 కొత్త ఫండ్ ఆఫర్ల (NFO) ద్వారా రూ. 7795 కోట్లను సమీకరించాయి. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ AUM (అసెట్ అండర్ మేనేజ్మెంట్) 30 సెప్టెంబర్ 2023 నాటికి రూ. 46.58 లక్షల కోట్లకు పెరిగింది. ఏ ఈక్విటీలో AUM గత నెలలో రూ. 18.6 లక్షల కోట్లుగా ఉన్న రూ.19.08 లక్షల కోట్లకు చేరుకుంది.
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!