NTV Telugu Site icon

800 Movie : ఓటీటీ లోకి రాబోతున్న ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’..

Whatsapp Image 2023 11 14 At 3.09.00 Pm

Whatsapp Image 2023 11 14 At 3.09.00 Pm

శ్రీలంక లెజెండరీ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు,టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘800’.ఈ మూవీకు ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ విన్నర్ షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన ఈ మూవీ స్క్రిప్ట్ ను రాశారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలుగు, హిందీ మరియు తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేశారు. శ్రీలంకలో ఈ సినిమా సింహళ భాషలో విడుదలైంది.ఈ మూవీ అక్టోబర్ 6 న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధం అయ్యింది. ‘800’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ‘జియో సినిమా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 2వ తేదీ నుంచి 800 మూవీ స్ట్రీమింగ్ మొదలు కానుందని నేడు ట్వీట్ చేసింది.800 మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ మరియు కన్నడ సింహళ భాషల్లో ‘800’ డిజిటల్ రిలీజ్ కానుంది. థియేటర్లలో సినిమా విడుదలైన సమయంలో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే ఆశించిన రీతిలో వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది . ప్రేక్షకులు ఎక్కువ మంది థియేటర్లకు రాలేదు. ఆ కారణంగా జియో ఓటీటీలో ఎక్కువ మంది చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

‘800’ సినిమాలో మురళీధరన్ పాత్రలో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించగా మురళీధరన్ భార్య మది మలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు.ఈ సినిమాలో శరత్ లోహితస్య ముఖ్య పాత్ర చేశారు.’800′ మూవీ లో కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా… అంతకు మించి తన వ్యక్తిగత విషయాలు ఎన్నో విషయాలు ఉన్నాయని సినిమా విడుదలకు ముందు ముత్తయ్య మురళీధరన్ తెలిపారు. తన బాల్యంలో శ్రీలంకలో తమిళులపై జరిగిన దాడులు అలాగే క్రికెట్ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత తనకు ఎదురైన అవమానాలు వంటివి ఇందులో చూపించారు. చెన్నైకు చెందిన అమ్మాయిని మురళీధరన్ వివాహం చేసుకున్నారు. ఆయనతో వివాహం తర్వాత ఆమెకు మీడియా నుంచి ఎదురైన ప్రశ్నను కూడా సినిమాలో చూపించారు. తొలుత విజయ్ సేతుపతి హీరోగా ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ చేయాలని అనుకున్నారు.. కానీ తమిళనాడులో కొందరి నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన మూవీ నుంచి తప్పుకొన్నారు. అప్పుడు మధుర్ మిట్టల్ ను సినిమాకు ఎంపిక చేసారు.అలాగే మొదట ఈ సినిమా నిర్మించాలనుకున్న వ్యక్తులు కూడా తప్పుకోవడంతో మరొకరు వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి శ్రీదేవి మూవీస్ అధినేత సినిమా కొనుగోలు చేసి చిత్రాన్ని విడుదల చేసారు.

https://twitter.com/JioCinema/status/1724298614514782663?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1724298614514782663%7Ctwgr%5E2665e46e837eb9ace23659460f742a5bd7c9d234%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

Show comments