NTV Telugu Site icon

Kedarnath Yatra: ముస్తాబైన కేదార్ నాథ్ ఆలయం.. రేపు తెరచుకోనున్న గుడి తలుపులు

Kedarnath Yatra

Kedarnath Yatra

కేదార్ నాథ్ ఆలయం ముస్తాబైంది. రేపే ఆలయ తలపులు తెరచుకోనున్నాయి. 40 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య జ్యోతిర్లింగ క్షేత్రమైన‌ కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరవనున్నారు. ఈ విష‌యాన్ని బద్రీనాథ్‌-కేదార్‌నాథ్ ఆల‌య క‌మిటీ ఛైర్మన్ అజేంద్ర అజ‌య్ తెలిపారు. చార్‌థామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ ఆల‌య ద్వారాల‌ను మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు తెర‌వ‌నున్నట్లు ఆయ‌న చెప్పారు.ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయాన్ని 40 క్వింటాళ్ల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు.

READ MORE: Kalvan OTT: ఓటీటీలోకి సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్‌ ఆలయం ఒకటి. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలంగా చెబుతారు. చార్‌ధామ్‌ యాత్రలో కేదార్ నాథ్‌ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌కు చేరుకుని పరమేశ్వరుడ్ని దర్శించుకుంటారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. మంచు కారణంగా ఆలయాన్ని మూసేస్తారు. శీతాకాలంలో దాదాపు ఆరు నెలల పాటు ఈ ఆలయ తలుపులు మూసే ఉంటాయి. ఆ సమయంలో ఆలయం మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. తిరిగి వేసవిలో ఈ ఆలయ తలుపులు తిరిగి తెరుస్తారు.

కాగా.. ఇప్పటికే చార్ధామ్ యాత్రలో భాగంగా రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. పర్యటనక శాఖ అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది. హరిద్వార్, రిషికేశ్‌లలో మే 8న ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. భక్తుల సౌకర్యార్థం ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ధర్మనగరిలోనూ ఆరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో నమోదుకు ఇంటర్నెట్ సౌకర్యం, లైట్, విద్యుత్‌తో పాటు ప్రయాణికులు కూర్చునేందుకు కుర్చీలు, నీరు తదితర ఏర్పాట్లను చేశారు. వీటిపై ఒక్కో ధామ్‌కు 500 మంది యాత్రికుల పేర్లను నమోదు చేస్తారు. ధర్మనగరిలోని పర్యాటక శాఖ కార్యాలయ ఆవరణలోనూ ఆరు కౌంటర్లను ఏర్పాటు చేశారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రి ధామ్ యాత్రికుల కోసం ఐదు వందల స్లాట్లు బుక్ చేసుకోవచ్చు.