ఉత్తరప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు వివాదంలో బుధవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. మసీదు బేస్‌మెంట్‌లోని వ్యాస్ టిఖానా దగ్గర ఉన్న హిందూ దేవతల విగ్రహాలకు పూజలు చేసుకొనేందుకు వారణాసి జిల్లా కోర్టు పర్మిషన్ ఇచ్చింది. వారంలోగా పూజలు చేసుకొనేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని న్యాయమూర్తి ఏకే విశ్వాస్ ఉతర్వులు జారీ చేశారు. ఇక నుంచి ఇక్కడ కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్టు పూజలు చేస్తుందని తీర్పు ఆదేశించారు. ఈ తీర్పుపై ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Ellyse Perry: ఎల్లీస్ పెర్రీ అందం ముందు హాలీవుడ్ హీరోయిన్స్ కూడా సరిపోరు!
ఇక, వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయాలని ముస్లిం పక్షం నిర్ణయించింది. ముస్లిం తరపు న్యాయవాది ముంతాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. హిందువులకు పూజలు చేసుకునే హక్కు కల్పిస్తూ జిల్లా జడ్జి తుది నిర్ణయం ఇచ్చారు.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. అలాగే, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సీనియర్ సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగి మహాలీ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం పట్ల ఖచ్చితంగా నిరాశ ఉంది.. అయితే ఉన్నత న్యాయస్థానాలకు మార్గం ఇంకా తెరిచి ఉంది.. సహజంగానే మా న్యాయవాదులు ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తారు.. జ్ఞానవాపి సమస్య అయోధ్య సమస్యకు భిన్నమైనదని ఆయన అన్నారు.
