Site icon NTV Telugu

Premanand Maharaj: ప్రేమానంద్ మహారాజ్ కోలుకోవాలని మదీనాలో ప్రార్థించిన ముస్లిం వ్యక్తి.. (వీడియో)

Muslim

Muslim

Premanand Maharaj: ప్రేమానంద్ మహరాజ్ ఆరోగ్యంగా ఉండాలని మదీనాలో ముస్లిం వ్యక్తి ప్రార్థించాడు. బృందావనంలో నివసించే సాధువు త్వరగా కోలుకోవాలని ఇస్లాం మతంలోని అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటైన మదీనాలో ప్రార్థించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సుఫియాన్ అలహాబాద్ అనే యువకుడు ఈ వీడియో రికార్డు చేశాడు. దీంతో ఈ వీడియో సర్వమత ఐక్యతకు చిహ్నంగా మారింది. సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. దాదాపు 1 నిమిషం 20 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో సుఫియాన్ అలహాబాద్ మదీనా పవిత్ర నేలపై రెండు చేతులు పైకెత్తి నిలబడి.. ఓ అల్లాహ్, దయచేసి భారతదేశ గొప్ప సాధువు ప్రేమానంద్ మహారాజ్‌ త్వరగా ఆరోగ్యవంతుడిని చేయ్యాలని ప్రార్థించారు.

READ MORE: Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ చిత్రపటానికి రైతుల పాలాభిషేకం

అతను తన ఫోన్‌లో సంత్ ప్రేమానంద్ మహారాజ్ ఫోటోను చూపిస్తూ.. “నేను గంగా-యమున సంగమం ఉన్న ప్రయాగ్‌రాజ్ నుంచి వచ్చాను. సంత్ ప్రేమానంద్ మహారాజ్ చాలా మంచి వ్యక్తి. ఆయన అనారోగ్యంతో ఉన్నారని మాకు తెలిసింది. మేము ఇప్పుడు ఖిజ్రాలో ఉన్నాం. అల్లాహ్ ఆయనకు ఆరోగ్యం, శ్రేయస్సును ప్రసాదించాలని ఇక్కడి నుంచి ప్రార్థిస్తున్నాం. మేము భారతదేశం నుంచి వచ్చాం. మేము ప్రేమానంద్ మహారాజ్‌ను ఆరాధిస్తాం. ఆయన చాలా మంచి వ్యక్తి.” అని పేర్కొన్నాడు. అయితే.. పవిత్ర మక్కాకు సమీపంలో ఉన్న సౌదీ అరేబియాలోని ఒక పవిత్ర నగరం.

READ MORE: Kavitha : లైబ్రరీ గేటు బద్దలు కొట్టిన జాగృతి నాయకులు

ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు మత సహనాన్ని ప్రదర్శించినందుకు ప్రశంసించారు. “ఆమీన్!!! మన మాతృభూమిలో శాంతి, సోదరభావం, సామరస్యం, శ్రేయస్సు నెలకొనాలి. జై భారత్” అని ఒక వినియోగదారు కామెంట్ చేశాడు. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ, సూఫియాన్ వీడియోను ప్రశంసించారు. మదీనా షరీఫ్ పవిత్ర స్థలం నుండి ప్రేమానంద్ మహారాజ్ కోసం సూఫియాన్ ప్రార్థించడం మానవత్వానికి నిజమైన ఉదాహరణ అని బరేల్వి అన్నారు. ఇదిలా ఉండగా.. సంత్ ప్రేమానంద్ మహారాజ్ కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. బృందావనంలోని శ్రీ రాధేహిత్ కెలికుంజ్ ఆశ్రమంలో చికిత్స పొందుతున్నారు. ఆశ్రమం నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది.

Exit mobile version