Site icon NTV Telugu

Musi River Project: మూసి పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక పరిణామం.. భూసేకరణ షురూ!

Musi River

Musi River

Musi River Rejuvenation Project: హైదరాబాద్ మూసి పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం మూసి అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు మూసి రివర్ డవలప్మెంట్ కార్పొరేషన్ (MRDCL) కీలక ప్రకటన చేసింది. ఫేజ్ A1 హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ A2 ఉస్మాన్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల మేర భూసేకరణ చేయనుంది. హైదరాబాద్‌, గోల్కొండ మండలం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలో భూముల అక్విజిషన్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం సుమారు 50 ఎకరాలకు పైగా భూమి సేకరణకు చర్యలు ప్రారంభమయ్యాయి. భూమి యజమానులకు మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. తమ హక్కుల పత్రాలు (పట్టాలు, ఆధార్, బ్యాంక్ వివరాలు) సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. నిర్ణీత సమయంలో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని స్పష్టం చేసింది. సర్వే నంబర్లు, గ్రామాల వారీగా పూర్తి జాబితా ప్రకటించింది. Land Acquisition Act, 2013 నిబంధనల ప్రకారం భూసేకరణ చేపట్టనుంది.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల పరిధిలో మూసి అభివృద్ధి పనులు చేపట్టనున్న విషయం తెలిసిందే. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55కిలోమీటర్ల పరిధిలోని 14 మండలాలు 46 గ్రామాల్లో దశల వారీగా 55 కిలో మీటర్ల మూసీ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

READ MORE: Rahul Gandhi: అవసరమైన వాటికి కేటాయింపులే లేవు.. బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విమర్శలు

Exit mobile version