NTV Telugu Site icon

Murugha Mutt Seer: మైనర్లపై లైంగిక వేధింపులు.. మురుగ మఠాధిపతికి జ్యుడీషియల్ కస్టడీ

Muruga Mutt

Muruga Mutt

Murugha Mutt Seer: మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటకలోని మురుగ మఠం ప్రధానార్చకుడు శివమూర్తి మురుగ శరణరును శుక్రవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
ఆయనను చిత్రదుర్గ జిల్లా జైలుకు తరలించారు. పోలీసులు రేపు ఓపెన్ కోర్టులో పోలీస్ రిమాండ్ కోరనున్నారు.ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల కేసులో శరణారావును కర్ణాటక పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కర్ణాటకలోని మురుగ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణరును పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మైనర్లను లైంగికంగా వేధించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అరెస్టు చేసినట్లు కర్ణాటక శాంతిభద్రతల విభాగం ఏడీజీపీ అలోక్​ కుమార్ వెల్లడించారు. అనంతరం వైద్యపరీక్షల కోసం జిల్లా ఆసుపత్రికి తరలించామని, ఆ తర్వాత జిల్లా సెషన్స్​ జడ్జి ఇంటికి తీసుకెళ్లి ఆమె ముందు హాజరుపరిచామని తెలిపారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారని, చిత్రదుర్గ పోలీస్​ స్టేషన్‌కు తరలించామని చెప్పారు.

ర్ణాటక చెందిన ఇద్దరు బాలికలు మైసూరులోని ఒక స్వచ్ఛంద సంస్థ వద్దకు వెళ్లి తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి అక్కడి అధికారులకు వివరించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మురుగ మఠాధిపతిని అరెస్ట్​ చేశారు. బాధితుల్లో ఒకరు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడం వల్ల మురుగ మఠాధిపతిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. అరెస్టు నేపథ్యంలో చిత్రదుర్గలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు కుట్రలో భాగమని, తాను చట్టానికి కట్టుబడి ఉన్నానని, విచారణకు సహకరిస్తానని మురుగ మఠాధిపతి తెలిపారు. ఆయన దాఖలు చేసిన బెయిల్​ పిటిషన్‌పై విచారణను స్థానిక కోర్టు సెప్టెంబరు 2కు వాయిదా వేసింది.

చిత్రదుర్గలోని ప్రభావవంతమైన మురుగ మఠం పీఠాధిపతిపై మైనర్ బాలికలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.ఎఫ్ఐఆర్ ప్రకారం, బాలికలు రెండేళ్లుగా వేధింపులకు గురయ్యారు. ఈ నెల ప్రారంభంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, పార్టీ నేతలు డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్‌తో కలిసి చిత్రదుర్గలోని మురుగ మఠాన్ని సందర్శించారు. మురుగ మఠం కూడా ఒక ప్రభావవంతమైన సంస్థగా ప్రసిద్ధి చెందింది.

Show comments