NTV Telugu Site icon

Murari: సూపర్ స్టార్ క్రేజ్ మాములుగా లేదుగా.. 2 రోజుల్లో 7 కోట్లకి పైగా వసూళ్లు..

Murari

Murari

Murari Re-release: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా.. తన సినిమాలలో భారీ విజయం సాధించిన మురారి సినిమాను రిరిలీజ్ చేసింది చిత్ర బృందం. ఆయన క్రేజ్ ఎలావుందో చెప్పేందుకు ఈ సినిమా రిలీజ్ వసూలను చూస్తే ఇట్లా చెప్పవచ్చు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమా మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో మురారి సినిమా వసూళ్ల సునామి సృష్టిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా 7.4 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను కాబట్టి ఔరా అనిపిస్తోంది.

100 Variety Foods: 100 రకాల పిండి వంటలతో అల్లుడికి ఘనస్వాగతం పలికిన అత్తమామలు..

ఇకపోతే నేడు ఈ సినిమా నుంచి మంచి వసూళ్లను ఆశిస్తున్నారు చిత్రం బంధం. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించగా పలువురు సీనియర్ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకి మర్చిపోలేని సంగీతాన్ని అందించారు. ఏదేమైనా కొత్త సినిమాలతో మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు మహేష్.

Electricity bill: ఫ్రిజ్, టీవీ, 4 ఫ్యాన్లకు రూ. 20 లక్షల కరెంట్ బిల్లు..