Liquor Shops Closed: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. రెండు రోజుల వైన్స్ బంద్ కానున్నాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సమయం ఆసన్నమవుతోంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. 13 ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఆయా మున్సిపాలిటీల పరిధిలోని మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈనెల 9వ తేదీ నుంచి సాయంత్రం 5 గంటల నుంచి 11 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఎన్నికల, ఆబ్కారీ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా 13వ తేదీ వరకు ఫలితాల నేపథ్యంలో వైన్స్, బార్లు మూసివేయనున్నారు.
READ MORE: Ghaziabad Case: ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు
మరోవైపు.. నేటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రానికి మైకులు మూగబోనున్నాయి. గతానికి భిన్నంగా ఈసారి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో రంగంలోకి దిగిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలన్న పట్టులతో ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలతో పాటు ఆయా పార్టీల నుంచి రెబల్స్ గా పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్దులు ప్రచారంలో మునిగి తేలారు. ర్యాలీలు, డప్పు చప్పుళ్లు, డీజే పాటల మోతలతో ప్రచారాన్ని హోరెత్తించారు. చివరి రోజు సుడిగాలి పర్యటనలకు నేతలు సిద్ధం అయ్యారు. నేడు సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి బ్రేక్ పడనుంది.
READ MORE: BCCI: బీసీసీఐ సెలక్షన్ కమిటీలో సంచలనం!
