Site icon NTV Telugu

Mumbai: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 10 మందికి తీవ్ర గాయాలు

Mumbai

Mumbai

Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భాండుప్ పశ్చిమ స్టేషన్ రోడ్ పరిసరాల్లో BEST బస్సు రివర్స్ తీస్తున్న సమయంలో అదుపు తప్పి పలువురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Russia Ukraine War: టెన్షన్.. టెన్షన్.. పుతిన్ నివాసం వద్ద ఉక్రెయిన్ డ్రోన్ దాడులు..

ప్రమాద సమాచారం అందగానే ముంబై అగ్నిమాపక శాఖ, పోలీసులు, BEST సిబ్బంది, 108 అంబులెన్స్‌లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో స్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులు, ఉద్యోగాలు ముగించుకుని ఇళ్లకు వెళ్లే వారు ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా భాండుప్ పశ్చిమ స్టేషన్ రోడ్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రజలను అదుపులోకి తీసుకురావడంలో పోలీసులకు శ్రమించాల్సి వచ్చింది.

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ప్రమాదంలో గాయపడిన వారిని, మృతులను రాజావాడీ బీఎంసీ ఆస్పత్రి, ఎం.టి. అగర్వాల్ ఆస్పత్రులకు తరలించారు. రాజావాడీ ఆస్పత్రిలో 31 ఏళ్ల గుర్తుతెలియని మహిళ మృతదేహంగా తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే 51 ఏళ్ల ప్రశాంత్ లాడ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎం.టి. అగర్వాల్ ఆస్పత్రిలో మరో ముగ్గురిని వైద్యులు మృతులుగా ప్రకటించారు. ప్రస్తుతం 9 మంది గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది.

Exit mobile version