Site icon NTV Telugu

Cyber Fraud: నిర్మలా సీతారామన్ ఫొటోతో నకిలీ ట్రేడింగ్ ప్రకటన.. రూ.1.47 కోట్లు స్వాహా..

Cyber

Cyber

Mumbai Cyber Fraud: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఒక షాకింగ్ సైబర్ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. షేర్ ట్రేడింగ్ స్కీమ్ ద్వారా ఓ రిటైర్డ్ డాకర్ట్‌ రూ.1.47 కోట్లు మోసపోయారు. ఆయన మోసపోవడానికి ప్రధాన కారణం ఓ ప్రకటన కావడం సంచలనం సృష్టించింది. బాధితుడి సోషల్ మీడియాలో ఓ నకిలీ ప్రకటన చూసి డబ్బులు ఇన్‌వెస్ట్‌ చేశారు. ఇంతకీ ఆ రిటైర్డ్ వైద్యుడిని అంతలా ప్రలోభపెట్టిన సోషల్ మీడియా ప్రకటన ఏంటని ఆశ్చర్య పోతున్నారా..? ఇది తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే! ఎందుకంటే.. మోసగాళ్ళు ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోను ఉపయోగించి ప్రకటన సృష్టించారు. ఈ మోసం ఎలా జరిగిందో.. పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం..

READ MORE: Natasa Stankovic: కొత్త కారు కొన్న హార్దిక్ పాండ్యా మాజీ భార్య.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. ముంబైకి చెందిన ఓ రిటైర్డ్ డాక్టర్ ఫేస్‌బుక్‌లో కేవలం రూ. 21,000 పెట్టుబడికి రూ. 60,000 వరకు “గ్యారంటీడ్ రిటర్న్” ఇస్తాం అనే ఓ ప్రకటనను చూశారు. ఆ ప్రకటనలో ఆర్థిక మంత్రి చిత్రాన్ని సైతం ఉపయోగించుకుని చట్టబద్ధంగా ఉన్నట్లు రూపొందించారు. బాధితుడు ఆ ప్రకటనపై క్లిక్ చేసి తన వివరాలను షేర్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే, పెట్టుబడి ప్రక్రియను ప్రారంభానికి ముందు ఓ కాల్ వచ్చింది. “మీనాక్షి” అనే మహిళ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది.UPSTOX సెక్యూరిటీస్ ప్రతినిధినని ఆ గుర్తు తెలియని యువతి పరిచయం చేసుకుంది. “SBI వెల్త్ మైండ్‌సెట్,” “సావెక్సా”,“రూబికాన్ రీసెర్చ్ లిమిటెడ్” అనే నకిలీ IPOలో పెట్టుబడి పెట్టేలా ప్రేరేపించింది ఆ కిలాడీ.. బాధితుడు విడతల వారీగా మొత్తం రూ.1.47 కోట్లను బదిలీ చేశారు. మోసగాళ్ళు నకిలీ వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను సృష్టించి, బాధితుడి పెట్టుబడి రూ.6.02 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.

READ MORE: Natasa Stankovic: కొత్త కారు కొన్న హార్దిక్ పాండ్యా మాజీ భార్య.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

దీంతో సంతోషం వ్యక్తం చేసిన ఆ వృద్ధుడు తన లాభాలను విత్‌డ్రా చేసుకోవాడానికి యత్నించాడు. ఎంత ప్రయత్నించినా విత్‌డ్రా కావడం లేదు. అంతేకాదు.. స్కామర్లు మరోసారి బాధితుడి కాల్ చేసి “గ్యారంటీ ఫీజు” పేరుతో మరో రూ.90 లక్షలు చెల్లించాలని కోరారు. దీంతో ఆ రిటైర్డ్ వైద్యుడికి అనుమానం వచ్చింది. తాను మోసపోతున్నట్లు గ్రహించాడు. వెంటనే ముంబై సెంట్రల్ సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో మోసగాళ్ళు నకిలీ కంపెనీలు, నకిలీ వెబ్‌సైట్‌లు, ఆర్థిక మంత్రి ఫోటోను ఉపయోగించి పెద్ద సైబర్ సిండికేట్‌ను నిర్వహిస్తున్నట్లు తేలింది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version