NTV Telugu Site icon

Raveena Tandon Car Accident: రవీనా టాండన్‌ మద్యం సేవించలేదు.. తప్పుడు కేసు నమోదు చేశాం: ముంబై పోలీసులు

Raveena Tandon

Raveena Tandon

Bollywood Actress Raveena Tandon Car Accident News: బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను, తన తల్లిని రవీనా కారు ఢీకొట్టిందని బురఖా ధరించిన ఓ మహిళ వీడీయోలో ఆరోపించింది. రవీనా, ఆమె డ్రైవర్‌పై ఆ మహిళ కుటుంబ సభ్యులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. అంతేకాదు రవీనా మద్యం సేవించారని, ర్యాష్ డ్రైవింగ్ చేశారని వారు ఫిర్యాదు చేశారు. అయితే నటి రవీనా టాండన్‌ మద్యం సేవించలేదని, ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడలేదని ముంబై పోలీసులు స్పష్టం చేశారు. రవీనాపై తప్పుడు కేసు నమోదయిందని పేర్కొన్నారు.

శనివారం బాంద్రాలోని కార్టర్‌ రోడ్డులో రవీనా టాండన్‌ తన కారులో వెళుతుండగా.. అదే రోడ్డులో ముగ్గురు మహిళలు వెళుతున్నారు. డ్రైవర్ కారును పార్క్ చేయడానికి రివర్స్ చేయగా.. తమను కారు ఢీకొట్టిందని ఓ మహిళ వాగ్వాదానికి దిగింది. ఇంతలోనే ఆ మహిళ కుటుంబసభ్యులు వచ్చి కారుపై దాడి చేశారు. డ్రైవర్‌ను రక్షించడానికి రవీనా కారు దిగి.. సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కారు ఢీకొట్టలేదు, మాపై దాడి చేయకండి అంటూ విజ్ఞప్తి చేశారు. అయినా వారు ఊరుకోలేదు. రవీనా ఫోన్ లాక్కునే ప్రయత్నం చేయడమే కాకుండా.. దాడి చేసేందుకు ప్రయత్నించారు.

Also Read: MS Dhoni-Nitish Reddy: ధోనీని అవమానించలేదు.. నాపై దుష్ప్రచారం చేస్తున్నారు: నితీశ్ రెడ్డి

రవీనా టాండన్, ఆ మహిళ కుటుంబం ఖార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. రవీనా కారు ఎవరినీ ఢీకొట్టలేదని తేలింది. అంతేకాదు ఆమె, కారు డ్రైవర్ మద్యం సేవించలేదని స్పష్టం అయింది. దాంతో ఆ మహిళ కుటుంబంను పోలీసులు హెచ్చరించారు. రవీనా టాండన్‌ మద్యం సేవించలేదని, ఆమెపై తప్పుడు కేసు నమోదైందని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రాజ్‌తిలక్ రోషన్ చెప్పారు.

Show comments