Site icon NTV Telugu

Video Viral: రైలులో మహిళతో కలిసి పోలీస్ అధికారి డ్యాన్స్.. వీడియో వైరల్

Police Dance

Police Dance

ముంబైలో ఓ పోలీసు అధికారి మహిళతో కలిసి డ్యాన్స్ చేసిన ఘటన వివాదానికి దారితీసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో.. ముంబై లోకల్ ట్రైన్‌లోని సెకండ్ క్లాస్ లేడీస్ కోచ్‌లో ఓ యువతితో కలిసి డ్యాన్స్ చేసినట్లు వీడియోలో ఉంది. ఈ ఘటన సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుండగా SF గుప్తా అనే పోలీసు అధికారిని పోలీసు ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. ఈ ఘటన డిసెంబరు 6న రాత్రి 10:00 గంటల నుంచి 10:15 గంటల మధ్య జరిగింది. అయితే.. రాత్రి ప్రయాణాల్లో మహిళల భద్రత కోసం హోంగార్డుగా గుప్తాను నియమించారు.

Read Also: CM Review: ధరణిపై ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

ఈ వీడియోలో మొదట్లో డ్యాన్స్ రీల్ చిత్రీకరిస్తున్న మహిళకు గుప్తా సూచనలు ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత.. గుప్తా యువతితో కలిసి మ్యూజిక్ కు తగ్గట్టు డ్యాన్స్ చేశారు. ఈ ఘటనపై డివిజనల్ రైల్వే మేనేజర్ అధికారిక ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. హోంగార్డుపై తక్షణమే చర్య తీసుకోవాలని RPFని ట్యాగ్ చేశాడు. కాగా స్పందించిన ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP).. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలనే లక్ష్యంతో అతనిపై నివేదికను దాఖలు చేశారు. యూనిఫాంలో, డ్యూటీలో ఉన్నప్పుడు ఫోటోలు తీయవద్దని.. వీడియోలకు ఫోజులివ్వవద్దని, సెల్ఫీలు దిగవద్దని సిబ్బంది అందరికీ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Read Also: Parliament security breach: నలుగురు కాదు ఆరుగురు.. పార్లమెంట్ దాడి ఘటనలో పరారీలో మరో ఇద్దరు..

Exit mobile version