NTV Telugu Site icon

Theft of shoes: బూట్లు దొంగిలించిన దొంగ కోసం పోలీసుల గాలింపు

Shoes

Shoes

ముంబైలోని బ్రిటీష్ దౌత్యవేత్త ఇంటి బయటి నుంచి ఒక జత బ్రాండెడ్ షూలను దొంగిలించిన దొంగ కోసం ముంబై పోలీసులు గాలిస్తు్న్నారు. డేవిడ్ మాథ్యూస్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ విషయంలో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మాథ్యూస్ గత రెండు దశాబ్దాలకు పైగా బ్రిటిష్ దౌత్యవేత్తగా పని చేశారు. అలాగే అనేక దేశాల్లో పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. గత ఏడాది కాలంగా కుటుంబంతో కలిసి ముంబైలోని బాంద్రాలో మాథ్యూస్ నివాసం ఉంటున్నాడు.

Read Also: PM Modi: కాంగ్రెస్ ఆవు పేడను కూడా వదల్లేదు..

ఇక, డేవిడ్ మాథ్యూస్ తన కొడుకు కోసం ఆగస్టులో సుమారు 6 వేల రూపాయల విలువైన బ్రాండెడ్ షూలను కొనుగోలు చేసినట్లు తెలిపాడు. అతని కుమారుడు ఒకసారి బూట్లు ధరించి.. ఆ తర్వాత ఆ బూట్లను ఇంటి వెలుపల ఉంచిన షూ రాక్‌లో ఉంచాడు. మంగళవారం నాడు మ మాథ్యూస్ కుమారుడు బయటకు వెళ్లడానికి అతని బూట్ల కోసం వెతకడానికి బయటికి వచ్చాడు. దీంతో వాటిని ఎవరు దొంగలించాడని గమనించి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Read Also: Bigg Boss 7: ఒక రేంజిలో ఆడుకున్న నాగార్జున… అతను డైరెక్ట్ ఇంటికే?

దాదాపు రూ. 6,000 ఖరీదు చేసే బూట్లను ఎవరో దొంగిలించారని ఆరోపిస్తూ బ్రిటిష్ దౌత్యవేత్త బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించి, బూట్లను రికవరీ చేయడంతో పాటు దొంగను పట్టుకోవాలని భావిస్తున్నారు. అయితే, బ్రిటీష్ హైకమిషన్‌లో పనిచేస్తున్న దౌత్యవేత్త డొమినిక్ ఓవెన్ స్టాంటన్ తన భార్యతో కలిసి జైసల్మేర్‌ను సందర్శించినప్పుడు ఇదే విధమైన సంఘటన జరిగింది. వారు లక్ష్మీనాథ్ ఆలయాన్ని సందర్శించినప్పుడు, స్టాంటన్ బూట్లను దొంగలించారు. ఇదే సమయంలో సదరు దొంగను కేవలం మూడు గంటల్లోనే పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.