NTV Telugu Site icon

Pakistan: సీమాను తిరిగి పంపకపోతే 26/11 తరహా దాడి హెచ్చరికలు.. కొందరిపై కేసు నమోదు!

Pakistan

Pakistan

Pakistan: పాకిస్థాన్ మహిళ సీమా హైదర్‌ను తమ దేశానికి తిరిగి పంపకపోతే 26/11 తరహా ఉగ్రదాడి జరుగుతుందని గత వారం హెచ్చరించిన కాల్‌కు సంబంధించి ముంబై పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఒక అధికారి ఈరోజు తెలిపారు. ముంబై పోలీసుల ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ రాగా.. అతను ఉర్దూలో మాట్లాడాడు. మహారాష్ట్ర రాజధానిపై నవంబర్ 26, 2008 నాటి దాడి వంటి ఉగ్రదాడి జరుగుతుందని, దానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పాడు.

బెదిరింపు కాల్‌పై ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని పోలీసు అధికారి చెప్పారు. ముంబై ట్రాఫిక్ పోలీసులు దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు, సంబంధిత నిబంధనల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తులపై సోమవారం వర్లీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. ఈ కేసును క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశామని, దీనిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఒక యాప్ ద్వారా కాల్ చేశారని, కాల్ చేసిన వ్యక్తి ఐపీ చిరునామాను ట్రాక్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని గతంలో ఒక అధికారి తెలిపారు.

Also Read: Opposition Alliance: విపక్షాల కూటమి కొత్త పేరు INDIA..

పాకిస్తాన్ మహిళ సీమా హైదర్, సచిన్‌ల ప్రేమ కథ దేశంలో చర్చనీయాంశంగా ఉంది. పాకిస్తాన్‌లోని రింగ్‌ హజానా గ్రామానికి చెందిన సీమా హైదర్ అనే వివాహిత పబ్జీ గేమ్‌ ద్వారా పరిచయమైన ఉత్తరప్రదేశ్‌ యువకుడితో ప్రేమలో పడింది. అతనితోనే జీవితాన్ని గడిపేందుకు పాకిస్తాన్‌ నుంచి తన నలుగురు పిల్లలను తీసుకొని అక్రమంగా భారత్‌లోకి అడుగుపెట్టింది. ఆమెను చేరదీసిన ప్రియుడు పెళ్లి చేసుకొని తన ఇంట్లోనే పెట్టుకోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే సీమా ఇక్కడ పెళ్లి తర్వాత మరోసారి పాకిస్తాన్ వెళ్లి తన నలుగురు పిల్లలతో కలిసి మళ్లీ నేపాల్ మీదుగా భారత్ చేరింది. అయితే ఆమెకు సంబంధించిన పత్రాల కోసం న్యాయవాదిని కలవడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో అధికారులు వీరిద్దరిని అరెస్ట్ చేశారు.

ఇటీవల వీరిద్దరికి బెయిల్ లభించింది. తాను తన భర్తలాగే హిందువునని, భారతీయురాలినని సీమా చెబుతోంది. తనను పాకిస్తాన్ పంపొద్దని వేడుకుంటోంది. పాక్‌కు వెళ్లడం కన్నా ఇక్కడే విషం తాగి మరణిస్తానని చెబుతోంది. ఈ ప్రేమజంట విషయంలో సీమా హైదర్‌ని పెళ్లి చేసుకున్న భర్త కూడా తన భార్యను వెనక్కి పంపించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. అయితే సీమా హైదర్ మాత్రం వెనక్కి వెళ్లేందుకు నిరాకరించింది. మరోవైపు సీమా హైదర్‌ని సచిన్ సంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లిని స్వాగతించిన అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కూడా పాకిస్తాన్‌కి చెందిన మహిళ సీమా హైదర్‌ను తమ కోడలిగానే భావిస్తున్నామని మద్దతు తెలుపుతున్నారు.

Also Read: Brijbhushan: లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్‌భూషణ్‌కు మధ్యంతర బెయిల్.. ఈ నెల 20న మళ్లీ విచారణ

ఇదిలా ఉంటే.. సీమా హైదర్ కూడా పాక్ గూఢచారి అనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా యూపీ ఏటీఎస్ బృందం పాకిస్తాన్ నివాసి సీమా హైదర్‌ను అదుపులోకి తీసుకుంది. ఏటీఎస్ సీమా హైదర్‌ను రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. సీమా హైదర్ మొదటి నుంచి ఏటీఎస్ రాడార్‌లో ఉన్నారు. ఆమె తన ప్రేమికుడు సచిన్‌ను కలవడానికి నేపాల్ మీదుగా భారత్‌లోకి వచ్చారు. ఇప్పుడు ఏటీఎస్ బృందం వాట్సాప్ చాట్ , అన్ని ఆధారాల ఆధారాలను పరిశీలిస్తున్నారు. అంతేకాదు వారి పరిచయం ఎలా జరిగింది అనే విచారణ జరుపుతున్నారు. దీంతో పాటు సీమ ఐడీ కార్డులను హైకమిషన్‌కు పంపించగా.. సీమ మామ పాకిస్థాన్ ఆర్మీలో సుబేదార్ అని, సీమ సోదరుడు పాకిస్తాన్ సైనికుడని తెలిసింది.

భారత భద్రతా ఏజెన్సీ ఇప్పుడు సరిహద్దులపై ఫోకస్ పెట్టింది. లవ్ స్టోరీ నుంచి ఇండియాకి వచ్చే వరకు అన్ని కోణాల్లోనూ ఎంక్వైరీలు జరుగుతున్నాయి ఏటీఎస్ బృందాలు. సీమా పాకిస్థాన్ పౌరురాలేనని.. ఆమె రాకలో చాలా సమస్యలు ఉన్నాయని యూపీ పోలీసులు తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో, ఆమెను విచారించడం అవసరం.. కాబట్టి దేశ భద్రతకు సంబంధించిన అన్ని ఏజెన్సీలు విచారిస్తున్నాయని తెలిపారు. ఏటీఎస్ అధికారులు సాధారణ దుస్తుల్లో సీమ ఇంటిని మోహరించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సీమా హైదర్‌ని ఏటీఎస్ తీసుకువెళుతున్నప్పుడు, ఆ వీధిలోకి మీడియాను కూడా అనుమతించలేదు.