Site icon NTV Telugu

Crime News: 20 నెలల పసికందుపై అత్యాచారం

Harassment

Harassment

Crime News: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. ఆడబిడ్డగా పుట్టడమే ఆ పసికందు చేసిన పాపం.. లైంగిక వేధింపులు ఆ 20 నెలల శిశువును కూడా వదల్లేదు. ఈ దారుణ ఘటన దేశ వాణిజ్య నగరమైన ముంబైలో చోటు చేసుకుంది.

సెంట్రల్ ముంబైలో 20 నెలల పసికందుపై పొరుగున నివసించే ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు ఈరోజు తెలిపారు. ఆదివారం తమ పొరుగువారిపై ఫిర్యాదు చేసేందుకు చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని ఓ అధికారి తెలిపారు.

Dog Dispute: తమిళనాడులో అంతే.. కుక్కని కుక్క అనకూడదా..?

ఫిర్యాదు ప్రకారం, కుటుంబం ఓ ఇంటిలో నివసిస్తోంది. వారి ఇంటికి ఎదురుగా ఉండే 35 ఏళ్ల వయస్సు గల వ్యక్తి రెండు రోజుల క్రితం తల్లిదండ్రులు లేని సమయంలో పసిబిడ్డపై అత్యాచారం చేశాడని బాధిత చిన్నారి తండ్రి చెప్పాడు. ఆ చిన్నారి ఏడుస్తూ తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చిందని అధికారి తెలిపారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376, పోక్సో చట్టంలోని సంబంధిత నిబంధనల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, వారిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

Exit mobile version