Mumbai puppy abuse case: ముంబై ఉత్తర భాగంలోని మలాద్ ప్రాంతంలో మనసును కలచివేసే ఘటన చోటు చేసుకుంది. కేవలం రెండు నెలల వయసున్న ఒక చిన్న కుక్కపిల్లపై ఓ యువకుడు దారుణంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం ఒక పబ్లిక్ టాయిలెట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల వికాస్ బేసాకర్ పాస్వాన్ అనే యువకుడు ఓ చిన్న కుక్కపిల్లను టాయిలెట్‌లోకి తీసుకెళ్లి దానిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు.. దాన్ని కొట్టినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ విషయం గమనించి.. జంతు ప్రేమికురాలు గీతా పటేల్‌కు సమాచారం ఇచ్చాడు. ఆమె వెంటనే స్పందించి పోలీసులకు ఫోన్ చేసింది.
READ MORE: Donald Trump: అమెరికా అధ్యక్షుడిపై కాసుల వర్షం.. 12 నెలల్లో – 12 వేల కోట్లకుపైగా లాభం!
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడిని పట్టుకున్నారు. తీవ్ర గాయాలైన ఆ కుక్కపిల్లను రక్షించి, వెంటనే వైద్య చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ కుక్కపిల్ల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత పబ్లిక్ టాయిలెట్ బయట స్థానికులు ఆ యువకుడిని చుట్టుముట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఈ ఘటనకు కారణమైన, కామంతో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గుడిని వెంటనే అరెస్ట్ చేయాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
READ MORE: Donald Trump: అమెరికా అధ్యక్షుడిపై కాసుల వర్షం.. 12 నెలల్లో – 12 వేల కోట్లకుపైగా లాభం!
