మహారాష్ట్ర ముంబై లోకల్ ట్రైన్‌లో ఓ యువతి హల్‌చల్ చేసింది. ఎదుటి ప్యాసింజర్ సీటుపై కాలుపెట్టిన ఆ లేడీ లాయర్ రుబాబు చేసింది. కాలు తీయమన్నా తీయకుండా కాస్త దురుసుగా ప్రవర్తించింది. తాముు లాయర్లమని, తమ ఇష్టం వచ్చినట్లు ఉంటామని నానా హంగామా చేసింది. తనతో పాటు ఉన్న మరో వ్యక్తితో కలిసి తోటి ప్రయాణికుడిపై వాగ్వాదానికి దిగింది. అంతేకాదు ఈ ఘటనను రికార్డు చేసినందుకు ప్రయాణికుడి మొబైల్‌ను లాక్కునేందుకు ప్రయత్నించింది.
@MumbaiPolice @Central_Railway @CPMumbaiPolice these people supposed to be lawyers and sitting in the train like this pic.twitter.com/W3dYwtGnSr
— prashantwaydande (@prashantwaydan3) February 1, 2023
ఇందుకు సంబంధించిన వీడియోను సదరు వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఈ లాయర్లు లోకల్ ట్రైన్‌లో ప్రయాణికులకు ఇబ్బంది కల్గించారని దానికి క్యాప్షన్‌గా రాసుకొచ్చాడు. ముంబై పోలీస్, రైల్వే శాఖను ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశాడు. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లాయర్ల తీరుపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లా చదివి ఇలాగేనా ప్రవర్తించేది అని కామెంట్లు చేస్తున్నారు. సామాన్యులంటే గౌరవం లేని వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
Also Read:Shahid Afridi: అల్లుడి బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన మామ..45 ఏళ్లలోనూ అదే పైర్