NTV Telugu Site icon

MI vs RCB: టాస్ గెలిచిన ముంబై.. బ్యాటింగ్ ఎవరిదంటే?

Rcb

Rcb

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా బిగ్ ఫైట్ కు సర్వం సిద్ధమైంది. ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ మరికాసేపట్లో మ్యా్చ్ జరుగబోతోంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కు దిగనుంది. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చారు. ఆర్‌సిబి తన జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

Also Read:Hyundai Exter Hy CNG: హ్యుందాయ్ ఎక్స్టర్ హై CNG కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే?

ప్రస్తుత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 గెలిచింది. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 33 మ్యాచ్‌లు జరగగా, ముంబై 19 మ్యాచ్‌లు గెలిచింది. బెంగళూరు 14 మ్యాచ్‌ల్లో గెలిచింది. కానీ గత 5 మ్యాచ్‌లను పరిశీలిస్తే, RCB ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. గత 5 మ్యాచ్‌ల్లో ఆర్‌సిబి 3 గెలిచింది.