NTV Telugu Site icon

Mumbai Indians: నికోలస్ పూరన్ విధ్వసం.. టైటిల్ విజేతగా ముంబై ఇండియన్స్!

Nicholas Pooran

Nicholas Pooran

MI New York Wins MLC 2023 Title after Nicholas Pooran Smashesh Hundred: మేజర్ లీగ్ క్రికెట్ (ఎమ్‌ఎల్‌సీ) 2023 టైటిల్ విజేతగా ముంబై ఇండియన్స్ న్యూయార్క్ నిలిచింది. సోమవారం డల్లాస్‌లో జరిగిన ఎమ్‌ఎల్‌సీ 2023 ఫైనల్‌లో సీటెల్ ఓర్కాస్‌పై ముంబై న్యూయార్క్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీటెల్ నిర్ధేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని ముంబై 16 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. ముంబై కెప్టెన్, విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 137 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పూరన్ విధ్వసంతో ముంబై జట్టు మేజర్ లీగ్‌ క్రికెట్‌ తొలి ఎడిషన్‌ ఛాంపియన్స్‌గా నిలిచింది.

ఫైనల్‌ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన సీటెల్ ఓర్కాస్‌ 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్‌ మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. 52 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 రన్స్ చేశాడు. శుబమ్‌ రాజనే (29), డ్వైన్ ప్రిటోరియస్ (21) పరుగుతో రాణించారు. సీటెల్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. ముంబై న్యూయార్క్ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌, రషీద్‌ ఖాన్‌ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. స్టీవెన్ టేలర్, డేవిడ్‌ వీసీ చెరో వికెట్‌ పడగొట్టారు.

Also Read: Amazon Smart Watch Offers 2023: అమెజాన్‌లో 80 శాతం తగ్గింపు ఆఫర్.. రూ. 1399కే స్మార్ట్ వాచ్! రూ. 5600 ఆదా

భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టుకు షాక్ తగిలింది. ఓపెనర్ స్టీవెన్ టేలర్ డకౌట్ అయ్యాడు. షాయన్ జహంగీర్ (10) నెమ్మదిగా ఆడినా.. నికోలస్ పూరన్ మొదటి బంతి నుంచే బాదుడు మొదలెట్టాడు. సిక్సుల వర్షం కురిపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. జహంగీర్ ఔట్ అయినా నికోలస్ విధ్వసం కొనసాగింది. సీటెల్ ఓర్కాస్‌ బౌలర్లను ఊచకోత కోసిన పూరన్.. 40 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. మొత్తంగా 55 బంతులు ఎదుర్కొన్న పూరన్‌ 137 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 184 టార్గెట్‌లో 137 పరుగులు పూరన్‌వే కావడం విశేషం. డెవాల్డ్ బ్రెవిస్ (20), టిమ్ డేవిడ్ (10 నాటౌట్) పూరన్‌కు అండగా నిలిచారు.

Also Read: SONY Bravia 55 Inch TV Offers: ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ సేల్.. సోనీ బ్రావియా 55 ఇంచ్ స్మార్ట్‌టీవీపై రూ. 164901 వేల డిస్కౌంట్!