NTV Telugu Site icon

Riding Auto on Platform: రైల్వే ప్లాట్‌ఫాంపై ఆటో నడిపాడు.. వీడియో వైరల్‌, డ్రైవర్‌ అరెస్ట్‌

Auto Driver

Auto Driver

Riding Auto on Platform: మహారాష్ట్రలో ముంబైలోని కుర్లా రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫాంలోకి ఆటో ప్రవేశించిన వీడియో వైరల్‌గా మారింది. ఆటో డ్రైవర్ నేరుగా ప్లాట్‌ఫాంపైకి ఆటోను తీసుకొచ్చాడు. చాలా మంది ఈ వీడియోను తిలకించారు. ఈ సంఘటన గురించి అధికారులు చర్యలు చేపట్టలేదని పలువురు విమర్శించారు. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు కూడా పోలీసులను ట్యాగ్ చేసి వీడియోను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన అధికారులు ఎట్టకేలకు అతడిపై చర్యలు తీసుకున్నారు. రైల్వే పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరపరిచారు. రైల్వే చట్టంలోని సంబంధింత సెక్షన్ల కింద ఆ ఆటో డ్రైవర్‌ శిక్షింపబడినట్లు ముంబై డివిజన్‌ రైల్వే పోలీసులు ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

ట్విట్టర్‌ ఫిర్యాదు ప్రకారం సదరు ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఆ ఆటోడ్రైవర్‌ను ఈ నెల 12వ తేదీన అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 12వ తేదీ మధ్యాహ్నం 1:00 గంటల సమయంలో ఆటో పొరపాటున ప్లాట్‌ఫాంపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం వెంటనే రైల్వే పోలీసు అధికారులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కోర్టుకు తరలించగా న్యాయస్థానం ఆ డ్రైవర్‌ను శిక్షించింది.