NTV Telugu Site icon

Amol Kale: ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హఠాన్మరణం

Ie

Ie

ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే (47) న్యూయార్క్‌లో సోమవారం గుండెపోటుతో మరణించారు. ఆదివారం జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వీక్షించేందుకు న్యూయార్క్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సందడిగా గడిపిన ఆయన.. అంతలోనే హఠాన్మరణానికి గురయ్యారు. దీంతో క్రికెట్ సంఘంలో, ముంబైలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి: Austrian airlines: గగనతలంలో భారీ వడగండ్లు.. దెబ్బతిన్న విమానం ముక్కు

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన అమోల్‌.. 2022లో ఎంసీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సన్నిహితుడిగా పేరుంది. బీసీసీఐ ఆటగాళ్లకు ఇచ్చే మ్యాచ్ ఫీజులనే ముంబై జట్టు సభ్యులకూ ఇచ్చేందుకు ముందుకురావడం, ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత మాజీ క్రికెటర్‌ సచిన్ తెందూల్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయడం వంటి ఎంసీఏ కీలక నిర్ణయాలు ఆయన హయాంలో తీసుకున్నవే. ఆయన పదవీ కాలంలోనే ముంబై జట్టు 2023-24 సీజన్‌ ‘రంజీ ట్రోఫీ’ని కైవసం చేసుకుంది. టీటీడీ బోర్డు మెంబర్‌గా కూడా ఉన్నారు.

ఇది కూడా చదవండి: Kesineni Nani: తమ్ముడి గెలుపు.. అన్న ముగింపు..! చర్చగా మారిన కేశినేని వ్యవహారం..