Corona Virus: కరోనా వచ్చి.. తగ్గిపోలేదు.. ఏడాది తర్వాతే దాని విశ్వరూపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corona Virus: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ప్రజా జీవితాన్ని సమూలంగా మార్చేసింది. మనిషి ఎదుటి వారిని చూసి జడుసుకునేంతగా చేసేసింది. అప్పటి వరకు మాస్క్, శానిటైజర్లంటే తెలియని జనానికి వాటిని తప్పనిసరి చేసింది. పలు దేశాల ఆర్థికవ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. ప్రతి సారి దాని ప్రభావం పోయింది.. అనుకునే లోపే మళ్లీ రూపం మార్చుకుని తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. తాజాగా బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డ ఏడాది తర్వాత శరీరంలోని ఏదో ఒక అవయవం దెబ్బతింటున్నదని అధ్యయనంలో తేలింది. అలసట, శ్వాస సమస్యలు, ఛాతి, కీళ్ల నొప్పులు, తలనొప్పి, మెదడు సంబంధ సమస్యలు, నిద్రలేమి, ఆందోళనతో రోగులు నిత్యం సతమతమవుతూనే ఉన్నారు.
Read Also: Wedding Card : పెళ్లికి ఒక్కమ్మాయే దొరకడం లేదంటే.. నీకు ఇద్దరా.. గ్రేట్ బాసూ
Also Read
- Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్‌తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
- US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
- Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
- Virat Kohli: ఇంగ్లాండ్‌కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే 'కోచ్'గా మారిన కోహ్లీ!
కాగా, దీర్ఘకాల కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న 59 శాతం మందిలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డ ఏడాది తర్వాత శరీరంలోని ఏదో ఒక అవయవం దెబ్బతింటున్నదని పరిశోధనలు తెలుపుతున్నాయి. కరోనా వైరస్ సోకినప్పుడు ఇబ్బంది పడని వారిలో కూడా ఈ సమస్య తలెత్తుతుందని పరిశోధకులు గుర్తించారు. 536 మంది కొవిడ్ రోగులపై పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. ఇందులో 13 శాతం మంది కరోనాతో దవాఖానలో చేరినవారు కాగా, 32 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు. ఈ 536 మంది రోగులకు ఆరు నెలల తర్వాత 40 నిమిషాల పాటు మల్టీ ఆర్గాన్ ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించారు. ఈ ఫలితాలను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విశ్లేషించగా, ఇందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ అధ్యయన ఫలితాలు ‘జర్నల్ ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురితమయ్యాయి.
- Tags
తాజావార్తలు
-
Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్‌తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
-
KTR : నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా.. రక్త పిశాచీ.?
-
US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్‌ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..