Fake Liquor Case: ములకలచెరువు నకిలీ మద్యం కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో వాట్సాప్ ఛాట్టింగ్ స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్ నిందితుడు జనార్ధన్‌తో ఛాట్టింగ్ చేసినట్టు ఒక స్క్రీన్ షాట్ వైరల్ గా మారింది. దీనిపై జోగి రమేష్ సీపీకి ఫిర్యాదు చేశారు. కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని జోగి ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బావమరిది పోసాని కోటేశ్వరరావు నిందితుడు జనార్ధన్‌తో ఛాట్టింగ్ చేసినట్టు స్క్రీన్ షాట్ వైరల్ అయ్యాయి. ఉద్దేశ పూర్వకంగా సోషల్ మీడియాలో ఇది వైరల్ చేస్తున్నారని వసంత వర్గం ఆరోపిస్తోంది.
READ MORE: Indore: ఫినాయిల్ తాగిన 24 మంది ట్రాన్స్‌జెండర్లు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
ఇక, ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్ధన్‌రావును అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని తంబళ్లపల్లెలో పీటీ వారెంట్ దాఖలు చేశారు ఎక్సైజ్ పోలీసులు.. దీనిపై విచారణను నేడు జరగనుంది. మరోవైపు.. నకిలీ మద్యం కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు.. రమేష్, అల్లా భక్షు, శ్రీకర్ అనే ముగ్గురిని విజయవాడలో విచారిస్తున్నారు ఎక్సైజ్ శాఖ పోలీసులు.. నకిలీ మద్యం తయారీకి ముగ్గురు సహకరించినట్టు గుర్తించారు.. ముగ్గురిని నేడు అరెస్ట్ చూపించే అవకాశం ఉంది.
READ MORE: Legally Veer : ‘లీగల్లీ వీర్’ – థియేటర్ హిట్ తర్వాత OTT స్ట్రీమింగ్‌లోకి !
