Mukesh Ambani: ‘మా దగ్గర బెస్ట్ షూటర్ ఉన్నాడు.. 20కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం’.. ముకేశ్ అంబానీకి బెదిరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Ambani: దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి. అంబానీ అధికారిక ఇమెయిల్ ఐడీకి బెదిరింపు వచ్చింది. తనకు భారతదేశంలో అత్యుత్తమ షూటర్లు పరిచయంలో ఉన్నారని ఈమెయిల్ పంపిన వ్యక్తి చెప్పాడు. 20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ మెయిల్ అక్టోబర్ 27న వచ్చింది. ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ ముంబైలోని గామ్‌దేవి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఎవరనే దానిపై విచారణ జరుగుతోంది. “మాకు రూ. 20 కోట్లు ఇవ్వకుంటే నిన్ను చంపేస్తాం. భారతదేశంలో అత్యుత్తమ షూటర్లు మా వద్ద ఉన్నారు” అని బెదిరింపు ఇమెయిల్‌లో రాసుకొచ్చారు.
Reliance Industries Chairman Mukesh Ambani received death threat on email on 27th October, threatening to shoot him if he failed to pay Rs 20 crores. Case registered under sections 387 and 506 (2) IPC in Gamdevi PS of Mumbai: Police
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
— ANI (@ANI) October 28, 2023
ఈ ఇమెయిల్‌ను స్వీకరించిన తర్వాత, ముఖేష్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు IPC సెక్షన్‌లు 387, 506 (2) కింద గుర్తు తెలియని వ్యక్తిపై FIR నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇమెయిల్ పంపబడిన IP చిరునామా కోసం గాలిస్తున్నారు. ముకేశ్ అంబానీకి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఫిబ్రవరి నెలలో ఒక వ్యక్తి నాగ్‌పూర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ముఖేష్ అంబానీ ఇంటి “యాంటిలియా”ని పేల్చివేస్తానని బెదిరించాడు. ఇది జరిగిన వెంటనే పోలీసులు యాంటిలియా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అంతకు ముందు కూడా అంబానీకి ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి. అతను దేశంలోనే అతిపెద్ద వ్యాపారవేత్త, భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారు. అందుకే వారి భద్రత విషయంలో ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!