NTV Telugu Site icon

Mukesh Ambani Security Cover Increased: ఇంటలిజెన్స్ రిపోర్ట్.. ముఖేష్ అంబానీకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ

Mukesh Ambani

Mukesh Ambani

ప్రముఖ పారిశ్రామిక వేత్త రిలయన్స్ సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ముఖేష్ అంబానీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రతను పెంచింది. ఇంటలిజెన్స్ ఏజెన్సీ నివేదిక ఆధారంగా ఇంతకుముందు కేటాయించిన సెక్యూరిటీని జెడ్ ప్లస్ కేటగిరికి పెంచింది. గతేడాది ముంబైలోని ముఖేశ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో బాంబు భయం తర్వాత పారిశ్రామిక వేత్తల భద్రతపై కేంద్ర మంత్రిత్వ శాఖ(MHA) దృష్టి సారించింది.

భద్రత ఎవరికి కల్పిస్తారు ?

సంఘ విద్రోహ శక్తులనుంచి అపాయం ఉంది అని భావించిన ప్రముఖులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రతను ఏర్పాటు చేస్తుంది. వీరిలో అత్యధిక ప్రజాదరణ కలిగి.. వారి జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని నిఘా సంస్థలు అందించే సమాచారం ఆధారంగా భద్రత అందిస్తారు. సంఘ విద్రోహ శక్తుల నుంచి వీరిని కాపాడడమే వారి విధి. నిఘా సంస్థ అందించే రిపోర్ట్ ఆధారంగా వివిధ రకాల భద్రతా కేటగిరిలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారికి కేటాయిస్తుంది. ప్రమాదాలను అంచనా వేసి భద్రతా వర్గాన్ని ఐదు గ్రూపులుగా విభజించారు. వాటిలో ఎక్స్, వై, జెడ్, జెడ్ ప్లస్, ఎస్పీజీ వర్గాలున్నాయి. భారత్ లోని వీఐపీలు, వీవీఐపీలు, అథ్లెట్లు, ఇతర ఉన్నత స్థాయి లేదా రాజకీయ ప్రముఖులకు ఈ రకమైన భద్రత ఏర్పాటు చేస్తుంది.

జెడ్ ప్లస్ భద్రత అంటే ఏమిటి?

జెడ్ ప్లస్ భద్రతా రక్షణలో రెండవ అత్యధిక స్థాయిని కలిగి ఉంటుంది. ఈ భద్రతా కవరేజ్ 10+ ఎన్ఎస్ జీ కమాండోలు, పోలీసు అధికారులతో కలపుకుని 55మంది ఫోర్స్ వీరికి రక్షణగా ఉంటారు. వీరంతా మార్షల్ ఆర్ట్స్, నిరాయుధ పోరాట శిక్షణలో నైపుణ్యం పొంది ఉంటారు. పొందారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఆర్థిక మంత్రి తదితర ప్రముఖులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ భద్రత కల్పించింది.